AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బీసీ రిజర్వేషన్‌ అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు.. పిటిషన్‌ కొట్టివేత

Telangana BC Reservation: సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. బీసీ రిజర్వేషన్ అంశంపై వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. తదుపరి విచారణ కొనసాగుతుందని వెల్లడించింది. అయితే ఈ సందర్భంగా ధర్మాసనం కీలక సూచనలు చేసింది. పాత రిజర్వేషన్లతో..

Telangana: బీసీ రిజర్వేషన్‌ అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు.. పిటిషన్‌ కొట్టివేత
Subhash Goud
|

Updated on: Oct 16, 2025 | 1:36 PM

Share

Telangana BC Reservation: సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై వేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. అయితే ఈ రిజర్వేషన్‌ అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకొని రావాలని చెప్పిన సుప్రీంకోర్టు .. తదుపరి విచారణ కొనసాగుతుందని వెల్లడించింది. అయితే ఈ సందర్భంగా ధర్మాసనం కీలక సూచనలు చేసింది. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లొచ్చంటూ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం పేర్కొంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్‌ సింగ్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు.

ఇది కూడా చదవండి: Telangana: అక్టోబర్‌ 18న తెలంగాణలో బంద్.. పాఠశాలలు, కళాశాలలకు సెలవు.. కారణం ఇదే!

ఇదిలా ఉండగా, బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో విచారణ వాడీ వేడిగా సాగాయి. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహత ధర్మాసనం విచారణ జరిపింది. ఈ పిటిషన్‌పై అభిషేక్‌ మను సంఘ్వీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని సింఘ్వి  ధర్మాసనానికి వెల్లడించారు. రిజర్వేషన్ల గరిష్ట పరిమితి 50% మించకూడదు అన్నది ఒక తప్పుడు అభిప్రాయమని, ఇందిరా సహానీ కేసు సహా మరికొన్ని తీర్పుల్లో.. సమగ్ర డేటా ఉంటే.. దాని ఆధారంగా రిజర్వేషన్లు కల్పించవచ్చని చెప్పాయని గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి

భారత దేశంలో ఏ రాష్ట్రం ఇలాంటి సర్వే ఎక్కడ నిర్వహించలేదని, ఎక్స్పర్ట్ కమిటీ సర్వేను మొత్తం ఎనలైజ్ చేసిందని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న అన్ని పార్టీ నాయకులు ఏకగ్రీవంగా ఆమోదించారన్నారు. గవర్నర్ 3 నెలలు గడిచినా బిల్లుపై ఎలాంటి చర్య చేపట్టలేదని, సుప్రీంతీర్పు ప్రకారం 3 నెలల్లో బిల్లును ఆమోదించకపోతే.. ఆటోమేటిగ్గా ఆమోదం పొందినట్లేనని సింఘ్వీ తెలిపారు.

ఇది కూడా చదవండి: Free Aadhaar: ఆధార్‌పై యూఐడీఏఐ కీలక ప్రకటన.. వారికి ఏడాది పాటు ఎలాంటి రుసుము లేదు!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి