Silver Price: దీపావళికి ముందే భగ్గుమంటున్న వెండి ధర.. కిలోకు రూ.2.74 లక్షలకు చేరుకోనుందా?
Silver Price: భారతదేశంలో డిమాండ్ పెరగడం, సరఫరా తగ్గడం వల్ల వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. పర్పుల్ జ్యువెల్స్‌కు చెందిన నితేష్ జైన్ ప్రకారం, "ప్రస్తుతం మార్కెట్లో వెండికి గణనీయమైన కొరత ఉంది. ఇది దీపావళి వల్ల మాత్రమే కాదు. కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు కూడా..

Silver Price: పండుగ సీజన్ వచ్చేసింది. ఒక వైపు బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వెండి ధరలు పెరగడం వల్ల సామాన్యుల కళ్లలో ఆనందం కనుమరుగైపోతుంది. మంగళవారం స్పాట్ మార్కెట్‌లో వెండి పని ధర కిలోగ్రాముకు రూ. 1 లక్ష 90 వేలకు చేరుకుంది. అయతే వెండితో తయారు చేసిన వస్తువుల మరింత పెరిగిపోయాయి. ముందే వెండి భారీగా పెరుగుతుండటం, అందులో వెండి వస్తువుల తయారీ ఖర్చులు పెరగడంతో మరింత భారం ఏర్పడుతోంది.
ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. దీపావళి సెలవులు పొడిగింపు!
వెండి ఎందుకు నిరంతరం ఖరీదైనదిగా మారుతోంది?
ప్రపంచవ్యాప్తంగా వెండికి డిమాండ్ వేగంగా పెరగడంతో ఈ రోజుల్లో వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు, సౌర ఫలకాల తయారీలో వెండిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు పెరగడానికి ఇదే కారణం. భారతదేశంలో కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. భారతదేశంలో వెండి ధరలు ఇప్పుడు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మొత్తం డిమాండ్‌లో పరిశ్రమ వాటా దాదాపు 60 నుండి 70 శాతం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: IRCTC: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ల విషయంలో కొత్త విధానం
భారతదేశంలో డిమాండ్ పెరగడం, సరఫరా తగ్గడం వల్ల వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. పర్పుల్ జ్యువెల్స్‌కు చెందిన నితేష్ జైన్ ప్రకారం, “ప్రస్తుతం మార్కెట్లో వెండికి గణనీయమైన కొరత ఉంది. ఇది దీపావళి వల్ల మాత్రమే కాదు. కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు కూడా కొనుగోళ్లు చేస్తున్నాయి. అంతేకాకుండా భవిష్యత్ ధరలను దృష్టిలో ఉంచుకుని పరిశ్రమలు ముందుగానే బుకింగ్ చేసుకుంటున్నాయి. అందుకే వెండి పెరుగుతోంది. ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది.”అని అన్నారు.
భారతదేశంలో వెండి ధర ఎంత పెరుగుతుంది?
ప్రస్తుతం భారతదేశంలో చెన్నైలో వెండి అత్యంత ఖరీదైనది. ధర కిలోకు రూ.2.07 లక్షలకు చేరుకుంది. ఇంతలో ఢిల్లీతో సహా ఇతర ప్రధాన మార్కెట్లలో, వెండి కిలోకు దాదాపు ₹1.90 లక్షలకు అమ్ముడవుతోంది. నితేష్ అంచనా వేసినట్లుగా వెండి ధరలు 23% పెరిగితే చెన్నైలో అది కిలోకు రూ.2.54 లక్షలకు చేరుకుంటుందన్నారు. ఇక రానున్న రోజుల్లో వెండి ధర రూ.2.74 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








