AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Telugu: ఇకపై టీవీ9తో మీ ఉదయాన్ని మరింత ఉత్సాహంగా మొదలు పెట్టండి.. మార్నింగ్ ఎక్స్‌క్లూజివ్ ప్రోగామ్స్‌..

వీక్షకుల ఉదయాన్ని మరింత ఉత్సాహంగా మార్చేందుకు తాజాగా మార్నింగ్‌ ఎక్స్‌క్లూజివ్‌ ప్రోగ్రామ్స్‌తో టీవీ9 ఛానల్ మీ ముందుకు వచ్చేస్తోంది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఇంట్రెస్టింగ్ పోగ్రామ్స్‌తో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది.

TV9 Telugu: ఇకపై టీవీ9తో మీ ఉదయాన్ని మరింత ఉత్సాహంగా మొదలు పెట్టండి.. మార్నింగ్ ఎక్స్‌క్లూజివ్ ప్రోగామ్స్‌..
Tv9 Telugu
Follow us
Narender Vaitla

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 08, 2023 | 4:07 PM

తెలుగు వార్తా ప్రపంచలో సరికొత్త వెలుగులా దూసుకొచ్చింది టీవీ9. తొలి 24/7 న్యూస్‌ ఛానల్‌గా సరికొత్త చరిత్రకు 2004లో శ్రీకారం చుట్టింది. టీవీ9 ప్రస్థానం మొదలైన నాటి నుంచి ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటోంది. ఇతర వార్తా సంస్థలేవీ అందించనంత వేగంగా, అత్యాధునిక సాంకేతికతతో ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తూ వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తెలుగు వారి ఉదయాన్ని మరింత ఉత్సాహంగా మార్చేందుకు తాజాగా మార్నింగ్‌ ఎక్స్‌క్లూజివ్‌ ప్రోగ్రామ్స్‌తో మీ ముందుకు వచ్చేస్తోంది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఇంట్రెస్టింగ్ పోగ్రామ్స్‌తో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రోగ్రామ్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు…

ఉదయం 8 గంటలకు టాప్‌ 80..

ప్రతీ ఉదయం బ్రేక్ ఫాస్ట్ టైమ్కి మీ మూడ్ రిఫ్రెష్ చేసే… టాప్ 80 ట్రెండింగ్ న్యూస్. ఏపీలో ఇఛ్చాపురం నుంచి హిందూపురం వరకు… తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి నల్గొండ వరకు. రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారాన్ని అందించనున్నాము. ఇక ఢిల్లీ జాతీయ రాజకీయాల నుంచి.. దక్షిణాది రాష్ట్రాల పొలిటికల్ పిక్చర్ వరకు నేషనల్‌ న్యూస్‌ అప్‌డేట్స్‌. అంతర్జాతీయ వార్తా కథనాల కోసం.. అమెరికా నుంచి లండన్ వరకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఆసక్తికర పరిణామాల సమాచారం అందిస్తాము. పది నిముషాల్లో పల్లె నుంచి పట్నం వరకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఘటనల నిర్విఘ్న వార్తా ప్రవాహాన్ని మీకు అందించనున్నాము.

ఇవి కూడా చదవండి

ఉదయం 8.25 గంటలు – ET Exclusive

టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది..? మూవీస్ నుంచి ఓటిటి వరకు లేటెస్ట్ అండ్ హాటెస్ట్ ట్రెండింగ్ న్యూస్ ఏంటి.? లాంటి సమస్త సినీ సమాచారం మీ ఇంటికి తీసుకొస్తున్నాం. టాలీవుడ్ లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, బాలీవుడ్ బాక్సాఫీస్ రిపోర్ట్‌తో పాటు.. కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్‌వుడ్‌లలో జరుగుతోన్న ఇంట్రెస్టింగ్‌ విషయాలతో టోటల్ సౌత్ సినిమా విశేషాలను మీకు అందించనున్నాము. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రపంచంలో జరుగుతోన్న అప్‌డేట్స్‌ పది నిమిషాల్లో మీకు అందిస్తాం.

ఉదయం 9 గంటలకు – Morning Super prime Time

నలుగురు యాంకర్లతో లోకల్‌ టూ గ్లోబల్‌ నాన్‌ స్టాప్‌ న్యూస్‌ షో. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ అప్ టు డేట్ డెలలప్‌మెంట్స్‌తో స్పెషల్‌ స్టోరీస్. మార్నింగ్ ప్రైమ్‌ టైమ్‌లో భాగంగా ప్రధాన వార్తలతో సరికొత్తగా న్యూస్‌ షో 9 AM.

ఉదయం 9.30 గంటలకు – Burning Topic

రాజకీయ చదరంగంలో ఏ పావును ఎవరు.. ఎటు కదుపుతున్నారు. అధికారం పక్షం ఎత్తులకు.. ప్రతిపక్షాల పై ఎత్తులు. స్టేట్ పాలిటిక్స్ టు సెంట్రల్ పాలిటిక్స్‌లో నెగ్గుతోందెవరు.. తగ్గుతోందెవరు రంగులు మారుస్తున్న రాజకీయ నాయకుల కౌంటర్లు .. ఎన్ కౌంటర్లు. ఇలాంటి ఎన్నో బర్నింగ్ పొలిటికల్ ఇష్యూస్‌ని ప్రేక్షకులకు అందించే సెటైరికల్‌ ప్రోగ్రామ్‌.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి..