Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ట్రిపులార్ తో కేటీఆర్.. అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గవర్నర్‌ ప్రసంగానికి ముందు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, రాజాసింగ్‌ తో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. వారి వద్దకు ప్రత్యేకంగా..

Telangana: ట్రిపులార్ తో కేటీఆర్.. అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం..
Ktr Etela Rajender
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 03, 2023 | 4:04 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గవర్నర్‌ ప్రసంగానికి ముందు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, రాజాసింగ్‌ తో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. వారి వద్దకు ప్రత్యేకంగా వెళ్లి మరీ ముచ్చటించారు. పలు అంశాలపై వారి మధ్య సంభాషణ జరిగింది. హుజూరాబాద్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని ఈటలను మంత్రి కేటీఆర్ ప్రశ్నించగా.. అందుకు ఆయన పిలిస్తే కదా హాజరయ్యేది అని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అక్కడికి వెళ్లారు. తననూ అధికారిక కార్యక్రమాలకు పిలవడం లేదని చెప్పారు. కనీసం కలెక్టర్‌ నుంచైనా ఆహ్వానం లేదని ఈటల తెలిపారు. ఆ తర్వాత రాజాసింగ్‌, కేటీఆర్‌ మధ్య కూడా సరదా సంభాషణ జరిగింది.

కాషాయ రంగు షర్ట్ వేసుకొచ్చిన రాజాసింగ్‌ను ఉద్దేశించి కేటీఆర్ ఫన్నీ కామెంట్స్ చేశారు. చొక్కా రంగు కళ్లకు గుచ్చుకుంటుందని.. ఆ రంగు తనక ఉ ఇష్టం ఉండదని కేటీఆర్‌ అన్నారు. వ్యాఖ్యానించారు. కాషాయ రంగు చొక్కా భవిష్యత్‌లో మీరూ వేసుకోవచ్చేమో అని రాజాసింగ్‌ సరదాగా అనడం గమనార్హం.

మరోవైపు.. గవర్నర్ ప్రసంగంపై ఈటల రాజేందర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసిన తప్పులను గవర్నర్‌తో చెప్పించారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. ధరణి గురించి ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరు గంటల కరెంట్ కూడా రావట్లేదని రైతులు సబ్ స్టేషన్లో వద్ద ఆందోళన చేస్తున్నారని చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో అనేక అబద్ధాలు ఉన్నాయని మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం