TSPSC: త్వరపడండి.. 8 వేలకు పైగా ఉద్యోగాలు.. ఇంకా కొద్ది నిమిషాలే గడువు..
తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది. వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ప్రకటనలు విడుదల చేస్తోంది. ఈ క్రమంలో గ్రూప్స్ కు సంబంధించిన అన్ని రకాల ఉద్యోగాలైన గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -3,..
తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది. వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ప్రకటనలు విడుదల చేస్తోంది. ఈ క్రమంలో గ్రూప్స్ కు సంబంధించిన అన్ని రకాల ఉద్యోగాలైన గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -3, గ్రూప్ – 4 ఉద్యోగాల నోటిపికేషన్లు రిలీజ్ అయ్యాయి. ఇవి వివిధ దశల్లో ఉన్నాయి. ఈ క్రమంలో గ్రూప్ -4 దరఖాస్తులకు పెంచిన గడువు సమయం ఇవాళ్టితో ముగియనుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలతో సమయం పూర్తి కానుంది. మొదట దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 30 తుది గడువుగా నిర్ణయించింది టీఎస్‌పీఎస్‌సీ. అయితే, మరికొందరు దరఖాస్తుదారుల ఇబ్బందుల్ని, అభ్యర్థనను దృష్టిలో ఉంచుకుని ఈ గడువును పొడిగిస్తూ టీఎస్‌పీఎస్‌సీ నిర్ణయం తీసుకుంది. తాజా దరఖాస్తు గడువును ఫిబ్రవరి 3 వరకు పొడిగించింది.
కాగా.. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రూప్-4 పరీక్ష తేదీ ఖరారైంది. జూలై 1న ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ వెల్లడించింది. ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 02.30 నుంచి సాయంత్రం 05.00 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు.
కాగ..గా దరఖాస్తుల స్వీకరణ గడువు పొడగించడంతో మరిన్ని దరఖాస్తులు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే అభ్యర్థులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకోవడంతో.. సర్వర్‌పై ఒత్తిడి అనూహ్యంగా పెరిగింది. దీంతో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత చెల్లింపులో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం