AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Layoffs: కొనసాగుతోన్న ఉద్యోగుల ఊచకోత.. ముందస్తు సమాచారం లేకుండానే పింక్‌ స్లిప్‌లిచ్చిన ఎడ్‌టెక్‌ సంస్థ.

ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపు కొనసాగుతూనే ఉంది. ఆర్థిక మాంద్యం ఈ ఏడాది ప్రపంచాన్ని అతలాకుతలం చేయనుందన్న వార్తల నేపథ్యంలో కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది...

Layoffs: కొనసాగుతోన్న ఉద్యోగుల ఊచకోత.. ముందస్తు సమాచారం లేకుండానే పింక్‌ స్లిప్‌లిచ్చిన ఎడ్‌టెక్‌ సంస్థ.
Layoffs
Narender Vaitla
|

Updated on: Feb 02, 2023 | 9:33 PM

Share

ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపు కొనసాగుతూనే ఉంది. ఆర్థిక మాంద్యం ఈ ఏడాది ప్రపంచాన్ని అతలాకుతలం చేయనుందన్న వార్తల నేపథ్యంలో కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఉద్యోగుల తొలగింపు అంతర్జాతీయ సంస్థలకే పరిమితం కాలేదు, దేశీయంగా కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి కంపెనీలు. భారత్‌కు చెందిన ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజుస్‌ ఉద్యోగులకు షాకిచ్చింది.

ఇదిలా ఉంటే గతంలోనే 2500 మందిని తొలగించిన ఈ యూనికార్న్‌ సంస్థ.. తాజాగా మరో 1000 మందిని తొలగించిందని తెలుస్తోంది. డిజైన్‌, ఇంజినీరింగ్‌, ప్రొడక్షన్‌ విభాగాలకు చెందిన ఉద్యోగులను ఇంటికి పంపించినట్లు సమాచారం. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో ఉద్యోగులను తొలగించే సమయంలో భవిష్యత్తులో ఉద్యోగుల తొలగింపు ఉండవని ఉద్యోగులకు హామి ఇచ్చారు. అయితే కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే మరో 1000 మందిని తొలగించడం గమనార్హం.

ఇక బైజూస్‌ ముఖ్యంగా ఆపరేషన్స్‌, లాజిస్టిక్స్‌, కస్టమర్‌ కేర్‌, ఇంజినీరింగ్‌, సేల్స్‌, మార్కెటింగ్‌, కమ్యూనికేషన్స్‌ వంటి విభాగాలను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించే ఆలోచనలో ఉందని సమాచారం. ఇదిలా ఉంటే ఉద్యోగులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే బైజూస్‌ ఉద్యోగులను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆఫీసులకు వచ్చిన వారికి నేరుగా పింక్‌ స్లిప్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరికొందరికి వాట్సాప్‌ లేదా నేరుగా కాల్స్‌ చేసి గూగుల్‌ మీట్‌లో కనెక్ట్‌ అవ్వాలని సూచించి తర్వాత ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు సమాచారం అందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక నోటీస్‌ పీరియడ్ ముగిసన తర్వాత ప్యాకేజీ చెల్లిస్తామని బైజూస్‌ తెలిపినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
థాయ్‌లాండ్, స్విట్జర్లాండ్‌కూ షాక్.. వెల్‌నెస్ ట్రావెల్‌లో భారత్
థాయ్‌లాండ్, స్విట్జర్లాండ్‌కూ షాక్.. వెల్‌నెస్ ట్రావెల్‌లో భారత్
ఎవరు గెలిచినా సరికొత్త చరిత్రే.. ఇది కదా అసలైన ట్విస్ట్..!
ఎవరు గెలిచినా సరికొత్త చరిత్రే.. ఇది కదా అసలైన ట్విస్ట్..!
పని చేయని బుద్ధి ఇనుములా తుప్పు పడుతుంది..మోనాలిసా సృష్టికర్త
పని చేయని బుద్ధి ఇనుములా తుప్పు పడుతుంది..మోనాలిసా సృష్టికర్త
10 కోట్లతో తీస్తే 1000 కోట్ల కలెక్షన్లు.. అంతలా ఏముందీ సినిమాలో..
10 కోట్లతో తీస్తే 1000 కోట్ల కలెక్షన్లు.. అంతలా ఏముందీ సినిమాలో..
Video: నా టార్గెట్ 200: వైభవ్ సూర్యవంశీ
Video: నా టార్గెట్ 200: వైభవ్ సూర్యవంశీ
ఈ తేదీల్లో పుట్టారా? అయితే డబ్బు, విలాస జీవితం మీ వెంటే!
ఈ తేదీల్లో పుట్టారా? అయితే డబ్బు, విలాస జీవితం మీ వెంటే!
బంగారం చోరీ చేసిందన్న ఫ్లాట్ ఓనర్.. మహిళా వాచ్‌మెన్ ఊహించని..
బంగారం చోరీ చేసిందన్న ఫ్లాట్ ఓనర్.. మహిళా వాచ్‌మెన్ ఊహించని..
జూన్‌లో ఎన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసా..?
జూన్‌లో ఎన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసా..?
సూపర్ సిబిల్ స్కోరుతో వద్దన్నా బ్యాంకుల్లో ప్రీమియర్ బెనిఫిట్స్
సూపర్ సిబిల్ స్కోరుతో వద్దన్నా బ్యాంకుల్లో ప్రీమియర్ బెనిఫిట్స్
‘వాళ్లంతా తోపులేమో’.. ఒక్క మాటతో ఇచ్చిపడేసిన సూర్యకుమార్ యాదవ్..!
‘వాళ్లంతా తోపులేమో’.. ఒక్క మాటతో ఇచ్చిపడేసిన సూర్యకుమార్ యాదవ్..!