AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చా..? బ్యాంకింగ్ రూల్స్ ఇవే..

ఇప్పట్లో చాలామంది బ్యాంకుల నుంచి లోన్లు, క్రెడిట్ కార్డులు వంటి వాటిని తీసుకుంటూ ఉంటారు. అయితే ఇవి తిరిగి చెల్లించకపోతే బ్యాంకులు ఆస్తులను స్వాధీనం చేసుకుంటూ ఉంటాయి. కానీ కొన్ని లోన్లకు మాత్రమే ఆస్తులను జప్తు చేయవచ్చు. మరికొన్ని లోన్లకు స్వాధీనం చేసుకోలేరు.

Credit Card: క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చా..? బ్యాంకింగ్ రూల్స్ ఇవే..
Credit Card Bill
Venkatrao Lella
|

Updated on: Aug 18, 2026 | 11:36 AM

Share

ఆర్ధిక అవసరాల దృష్ట్యా చాలామంది బ్యాంక్ రుణాలను తీసుకుంటూ ఉంటారు. రుణాల్లో అనేక రకాలు కేటగిరీలు ఉన్నాయి. పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, ప్రాపర్టీ లోన్ లాంటి అనేక ఆప్షన్లు ఉంటాయి. మీ అవసరానికి తగ్గట్లు లోన్ ఎంచుకుని బ్యాంకుల నుంచి పొందవచ్చు. అయితే ఈఎంఐ ఆప్షన్‌లో ఎక్కువమంది లోన్ తీసుకుంటారు. అంటే ప్రతీ నెలా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారినప్పుడు ఈఎంఐ చెల్లించడం మానేస్తుంటారు. ఇలాంటప్పుడు బ్యాంకులు డీఫాల్టర్‌గా పరిగణించి మీ ఆస్తులను జప్తు చేస్తూ ఉంటాయి.

ఆస్తులు ఎప్పుడు జప్తు చేస్తారు..?

హోమ్ లోన్, వెహికల్ లోన్ తీసుకుని ఎగ్గొట్టినప్పుడు మీ ఆస్తులను బ్యాంకులు జప్తు చేసే అవకాశముంటుంది. ఇలాంటి సమయంలో తాకట్టు పెట్టిన ఆస్తులను నిబంధనల ప్రకారం జప్తు చేయవచ్చు. అయితే దీనిని ముందు చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈఎంఐ చెల్లించనంత మాత్రాన వెంటనే ఆస్తులను స్వాధీనం చేసుకోలేరు. దీనిక ఒక ప్రక్రియను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ముందుగా మీ ఖాతాను ఎన్‌పీఏగా పరిగణిస్తారు. ఆ తర్వాత సర్పేసి చట్టం సెక్షన్ 13(2) కింద 60 రోజుల గడువు ఇస్తూ బ్యాంకులు డిమాండ్ నోటీస్ జారీ చేస్తాయి. రుణగ్రహీత నోటీస్‌పై అభ్యంతరం చెబితే దానిని పరిశీలించి 15 రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ లాంటి అన్‌సెక్యూర్డ్ లోన్ విషయంలో ఆస్తులను జప్తు చేయడం కుదరదు. అయితే ఈఎంఐ చెల్లించని సమయంలో లోన్ రికవరీ ఏజెట్లు వేధిస్తూ ఉంటారు. ఏజెంట్లు చేసే ప్రతీ తప్పుకు బ్యాంకులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య మాత్రమే కస్టమర్‌కి కాల్ చేయాలి. స్నేహితులు, బంధువులు, ఇతరులకు ఫోన్లు చేసి వేధించడం చట్ట విరుద్దంగా భావిస్తారు. బూతులు తిట్టడం, దాడికి దిగడం, పోలీసుల కేసు పేరుతో బెదిరించడం నిబంధనలకు విరుద్దమని చెప్పవచ్చు.

వేధిస్తే ఎలా ఫిర్యాదు చేయాలి..?

ఏజెంట్లు మిమ్మల్ని బెదిరించినా లేదా వేధించినా వాటికి సంబంధించిన కాల్ రికార్డులను భద్రపర్చుకోవాలి. బ్యాంక్ గ్రీవెన్స్ డిపార్ట్‌మెంట్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. 30 రోజుల్లో సమస్యకు పరిష్కారం లభించకపోతే ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌కు ఆశ్రయించాలి. ఇక లోన్ ఏజెంట్లపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బ్యాంక్ మేనేజర్‌ను సంప్రదించి రీస్ట్రక్చరింగ్ కోసం రిక్వెస్ట్ చేయవచ్చు.

Follow Us