TS High court jobs: తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం పొందే అవకాశం.

తెలంగాణ హైకోర్టులో ఇటీవల వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్‌ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తెలంగాణ స్టేట్‌ జ్యుడీషియల్‌ సర్వీసులో సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) పోస్టుల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది...

TS High court jobs: తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం పొందే అవకాశం.
TS High Court
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 03, 2023 | 7:55 PM

తెలంగాణ హైకోర్టులో ఇటీవల వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్‌ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తెలంగాణ స్టేట్‌ జ్యుడీషియల్‌ సర్వీసులో సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) పోస్టుల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 సివిల్‌ జడ్జి పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 08 ఖాళీలు, బదిలీల ద్వారా 2 ఖాళీలు భర్తీ కానున్నాయి.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ. మూడేళ్ల పాటు అడ్వకేట్ లేదా ప్లీడర్‌గా ప్రాక్టీస్ చేసి ఉండాలి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, రాత పరీక్ష, వైవా-వాయిస్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన వారికి నెలకు రూ. 77,840 నుంచి రూ. 1,36,520 వరకు చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ గడువు 01-03-2023తో ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..