AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila: షర్మిల పాదయాత్రలో టెన్షన్ టెన్షన్.. ఫ్లెక్సీలు ధ్వంసం.. ఇంతకీ రీసన్ ఏంటంటే..

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల పాదయాత్ర నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. వర్ధన్నపేట నియోజక వర్గంలో పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు చెందిన ఫ్లెక్సీలు ధ్వంసం అయ్యాయి. పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి...

YS Sharmila: షర్మిల పాదయాత్రలో టెన్షన్ టెన్షన్.. ఫ్లెక్సీలు ధ్వంసం.. ఇంతకీ రీసన్ ఏంటంటే..
Ys Sharmila Flexi
Ganesh Mudavath
|

Updated on: Feb 03, 2023 | 7:30 PM

Share

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల పాదయాత్ర నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. వర్ధన్నపేట నియోజక వర్గంలో పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు చెందిన ఫ్లెక్సీలు ధ్వంసం అయ్యాయి. పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్ పై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు షర్మిలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్టీపీ ఫ్లైక్సీలను బీఆర్ఎస్ నేతలు ధ్వంసం చేశారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. షర్మిల చేపట్టిన పాదయాత్ర రోజుకో మలుపు తీసుకుంటోంది. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. అధికార పార్టీపై ఆమె తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టే అధికార పక్షం కూడా దీటుగా సమాధానమిస్తోంది.

అయితే.. పాదయాత్రపై షర్మిల స్పందించారు. పాదయాత్ర ఒక యజ్ఞం అన్న ఆమె.. అది అందరికీ సాధ్యం కాదని చెప్పారు. ఎక్కడైతే తన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆగిందో అక్కడి నుంచే మళ్లీ స్టార్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తున్నందున గవర్నర్‌ను కలవడం కుదరలేదన్నారు. తాను వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించనని, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే ప్రశ్నిస్తానన్నారు. తన పాలనపై నమ్మకం ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పాదయాత్రకు రావాలని సవాల్‌ విసిరారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాతో కలిసి పాదయాత్రకు రావాలి. ప్రజలకు సమస్యలు ఏమీ లేవని రుజువు చేస్తే ముక్కు నేలకు రాసి, రాజకీయాలు మానేస్తాను. సమస్యలు ఉన్నాయని తేలితే కేసీఆర్‌ తన పదవికి రాజీనామా చేయాలి. ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయని కేసీఆర్‌ పాలనను అంతం చేయాలి.

ఇవి కూడా చదవండి

       – వైఎస్.షర్మిల, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం