CM Revanth: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు సోనియా హాజరు.. కేసీఆర్‎కు కేసీఆర్‎కు కాంగ్రెస్ సర్కార్ లేఖ..

తెలంగాణ ఆవిర్భవించి 2024 జూన్ 2 తో దశాబ్దం పూర్తవుతున్న తరుణంలో రాష్ట్రానికి సోనియా గాంధీ విచ్చేయనున్నట్లు తెలిపారు కాంగ్రెస్ నేతలు. జూన్ 2న ఉదయం 10.30కి పరేడ్ గ్రౌండ్‎లో జరిగే కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ హాజరుకానున్నారు. ముందుగా బేగంపేట విమానాశ్రయంలో దిగిన తరువాత నేరుగా అమరవిరుల స్థూపం వద్దకు చేరుకుని నివాళులు అర్పించనున్నారు. ఆ తరువాత పరేడ్ గ్రౌండ్స్‎లో ఏర్పాటు చేసిన రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొననున్నారు.

CM Revanth: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు సోనియా హాజరు.. కేసీఆర్‎కు కేసీఆర్‎కు కాంగ్రెస్ సర్కార్ లేఖ..
Telangana
Follow us

|

Updated on: May 30, 2024 | 8:25 PM

తెలంగాణ ఆవిర్భవించి 2024 జూన్ 2 తో దశాబ్దం పూర్తవుతున్న తరుణంలో రాష్ట్రానికి సోనియా గాంధీ విచ్చేయనున్నట్లు తెలిపారు కాంగ్రెస్ నేతలు. జూన్ 2న ఉదయం 10.30కి పరేడ్ గ్రౌండ్‎లో జరిగే కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ హాజరుకానున్నారు. ముందుగా బేగంపేట విమానాశ్రయంలో దిగిన తరువాత నేరుగా అమరవిరుల స్థూపం వద్దకు చేరుకుని నివాళులు అర్పించనున్నారు. ఆ తరువాత పరేడ్ గ్రౌండ్స్‎లో ఏర్పాటు చేసిన రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొననున్నారు. సోనియా గాంధీ రాక నేపథ్యంలో భద్రతాపరమైన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు అధికారులు. తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిద్దమైంది రేవంత్ సర్కార్. ఈ తరుణంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కార్యక్రమం నిర్వహణపై ప్రత్యేకంగా శ్రద్దపెట్టి ప్రణాళికలు రచించారు.

ఇదిలా ఉంటే సీఎం రేవంత్ సర్కార్ ప్రభుత్వం తరఫున మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కూడా ప్రత్యేక ఆహ్వానం పంపించింది. జూన్ 2వ తేదీన ఉదయం 10 గంగలకు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్‎లో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్‎ను ఆహ్వానిస్తూ ప్రత్యేకంగా లేఖరాశారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే వ్యక్తిగత ఆహ్వాన పత్రిక పంపించినట్లు కూడా తెలిపారు. దానిని స్వయంగా కేసీఆర్‎కు అందించాలని ప్రోటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్‎కు, డైరెక్టర్ అరవింద్ సింగ్‎కు సూచించారు. కేసీఆర్‎ను స్వయంగా కలిసి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వాన పత్రిక అందించేందుకు కేసీఆర్ సిబ్బందితో చర్చలు కొనసాగిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ గజ్వెల్ ఫామ్ హౌస్‎లో ఉన్నారని సిబ్బంది తెలిపింది. అక్కడకు వెళ్లి స్వయంగా ఆహ్వాన పత్రిక, సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖను అందించేందుకు హర్కర వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్ ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..