తండ్రిపై కర్కషంగా ప్రవర్తించిన కొడుకు.. ఆస్తి కోసం ఎంతటి దారుణానికి ఒడిగట్టాడంటే..
పెంచిన తండ్రిని నానా ఇబ్బందులకు గురిచేసిన కొడుకు ఒక రూములో బంధించాడు. బంగారము, వెండి వస్తువులు బలవంతంగా తీసుకోవడమే కాకుండా బలవంతంగా వ్యవసాయ పొలం రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. కొమురవెల్లి శ్రీనివాస్ తండ్రి ముత్యాలు వయస్సు 52 సంవత్సరాలు. సీసీ నగర్ సికింద్రాబాద్ కొమురవెల్లి కనకలక్ష్మి భరత శ్రీనివాస్, 47 సంవత్సరాలు, సీసీ నగర్ సికింద్రాబాద్లో నివాసముంటున్నాడు.
పెంచిన తండ్రిని నానా ఇబ్బందులకు గురిచేసిన కొడుకు ఒక రూములో బంధించాడు. బంగారము, వెండి వస్తువులు బలవంతంగా తీసుకోవడమే కాకుండా బలవంతంగా వ్యవసాయ పొలం రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. కొమురవెల్లి శ్రీనివాస్ తండ్రి ముత్యాలు వయస్సు 52 సంవత్సరాలు. సీసీ నగర్ సికింద్రాబాద్ కొమురవెల్లి కనకలక్ష్మి భరత శ్రీనివాస్, 47 సంవత్సరాలు, సీసీ నగర్ సికింద్రాబాద్లో నివాసముంటున్నాడు. కొమురవెల్లి ముత్తయ్య తండ్రి బాలయ్య వయస్సు 68 సంవత్సరాలు. చిన్నకోడూర్ మండలంలో నివాసముంటున్నాడు. ఆయనకు పిల్లలు లేనందున తన అన్న కొడుకు శ్రీనివాసును చిన్నప్పటి నుండి పెంచుకొని వివాహం కూడా చేశాడు. తదుపరి భార్య చనిపోయినందున హైదరాబాదు నుండి తన స్వగ్రామం రామంచకు వచ్చి ఇంటి వద్ద ఉంటున్నాడు.
ఒంటరిగా జీవనం కొనసాగిస్తున్నడు. తోడు కావాలని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించగా విషయం తెలిసిన పెంపుడు కొడుకు శ్రీనివాస్ కారులో వచ్చి ముత్తయ్యను బెదిరించాడు. బీరువా తాళాలు లాక్కొని అందులో ఉన్న బంగారు, వెండి వస్తువులు, నగదు డబ్బులు బలవంతంగా తీసుకున్నాడు. ముత్తయ్యను కారులో ఎక్కించుకొని సికింద్రాబాద్లోని సీసీ నగర్ తీసుకొని వెళ్లాడు. తన ఇంట్లో ఉన్న ఒక రూమ్లో బంధించాడు. పుల్లూరు గ్రామంలో ముత్తయ్య పేరుపై ఉన్న ఒక ఎకరం వ్యవసాయ పొలమును డాక్యుమెంట్ తయారు చేయించాడు. సిద్దిపేట తహసిల్దార్ ఆఫీసులో పెంపుడు కొడుకు శ్రీనివాస్ పేరుపైన రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అదే కారులో ముత్తయ్యను తీసుకొని వెళ్లి మళ్లీ రూమ్లో బంధించి నానా ఇబ్బందులకు, చిత్రహింసలకు గురి చేసాడు. ముత్తయ్య బాధలు భరించలేక ఎట్టకేలకు తప్పించుకొని వచ్చి తనకు జరిగిన అన్యాయం గురించి చిన్నకోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తండ్రి ముత్తయ్య వద్దనుండి బలవంతంగా తీసుకొని వెళ్ళిన బంగారు, వెండి వస్తువులు, నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…