Lucknow: Lucknow: విమానాశ్రయంలో కార్గో లగేజీ స్కానింగ్ చేయగా..బీప్ బీప్ అని సౌండ్..ఏంటని చూస్తే గుండె ఆగినంత పనైంది..!
ఎప్పటిలాగే లక్నో ఎయిర్‌పోర్ట్‌లోని కార్గో సిబ్బంది మంగళవారం కార్గో కోసం బుక్ చేయాల్సిన లగేజీని స్కాన్ చేస్తున్నారు. ఇంతలో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన కొరియర్ ఏజెంట్ కార్గో ద్వారా సరుకులు బుక్ చేసుకునేందుకు వచ్చాడు. బుక్ చేసిన లగేజీని కార్గో సిబ్బంది స్కాన్ చేయగా ప్లాస్టిక్ బాక్సులో నవజాత శిశువు మృతదేహం కనిపించింది.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కార్గో లగేజీలో స్కానింగ్‌లో నవజాత శిశువు మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. విమానాశ్రయానికి కొరియర్‌కు వచ్చిన ఓ ఏజెంట్ లగేజీ పెట్టెలో అప్పుడే పుట్టిన చిన్నారి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని చూసిన కార్గో కార్మికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే కార్గో సిబ్బంది సీఐఎస్‌ఎఫ్‌కు సమాచారం అందించారు. దీంతో పాటు కొరియర్ కోసం వచ్చిన యువకుడిని పట్టుకుని సీఐఎస్ఎఫ్ జవాన్లకు అప్పగించారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆ యువకుడిని విచారించగా.. మృతదేహం గురించి ఏమీ చెప్పలేకపోయాడు.
ఎప్పటిలాగే లక్నో ఎయిర్‌పోర్ట్‌లోని కార్గో సిబ్బంది మంగళవారం కార్గో కోసం బుక్ చేస్తున్న వస్తువులను స్కాన్ చేస్తున్నారు. ఇంతలో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన కొరియర్ ఏజెంట్ కార్గో ద్వారా సరుకులు బుక్ చేసుకునేందుకు వచ్చాడు. బుక్ చేసిన లగేజీని కార్గో సిబ్బంది స్కాన్ చేయగా ప్లాస్టిక్ బాక్సులో నవజాత శిశువు మృతదేహం కనిపించింది. ఇది చూసిన కార్గో ఉద్యోగులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ ఘటనపై వెంటనే సీఐఎస్‌ఎఫ్‌కు సమాచారం అందించారు.