వారిని టార్గెట్‎గా చేసుకుని బెట్టింగ్ దందా.. దీని వెనుక ఉన్నది ఎవరంటే..

జోగుళాంబ గద్వాల్ జిల్లాల్లో క్రికెట్ బెట్టింగ్ కలకలం రేపుతోంది. ఇటివల ఆన్లైన్లో బెట్టింగ్ పాల్పడుతూ పోలీసులకు చిక్కిన గ్యాంగ్ తీగ లాగితే మొత్తం బెట్టింగ్ రాకేట్ డొంక కదులుతున్నది. గ్రామీణ ప్రాంతంలోని యువత, నిరక్ష్యరాస్యులను లక్ష్యంగా చేసుకొని నగదు, భూమి, వాహనాలు, బంగారు అభరణాలు దోచుకుంటున్నారు. ఈ క్రికెట్ బెట్టింగ్ దందాలో ఓ ఎస్సై కుమారుడు వ్యవహారం హాట్ టాపిక్‎గా మారడంతో జిల్లా ఎస్పీ ప్రత్యేక దర్యాప్యు చేయిస్తున్నారు.

వారిని టార్గెట్‎గా చేసుకుని బెట్టింగ్ దందా.. దీని వెనుక ఉన్నది ఎవరంటే..
Jogulamba Gadwal District
Follow us
Boorugu Shiva Kumar

| Edited By: Srikar T

Updated on: May 30, 2024 | 6:45 PM

జోగుళాంబ గద్వాల్ జిల్లాల్లో క్రికెట్ బెట్టింగ్ కలకలం రేపుతోంది. ఇటివల ఆన్లైన్లో బెట్టింగ్ పాల్పడుతూ పోలీసులకు చిక్కిన గ్యాంగ్ తీగ లాగితే మొత్తం బెట్టింగ్ రాకేట్ డొంక కదులుతున్నది. గ్రామీణ ప్రాంతంలోని యువత, నిరక్ష్యరాస్యులను లక్ష్యంగా చేసుకొని నగదు, భూమి, వాహనాలు, బంగారు అభరణాలు దోచుకుంటున్నారు. ఈ క్రికెట్ బెట్టింగ్ దందాలో ఓ ఎస్సై కుమారుడు వ్యవహారం హాట్ టాపిక్‎గా మారడంతో జిల్లా ఎస్పీ ప్రత్యేక దర్యాప్యు చేయిస్తున్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నడిగడ్డలో క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ యథేచ్ఛగా సాగుతోంది. ఆన్ లైన్ లింక్‎లు, వాట్సాప్ గ్రూప్‎ల్లో మెసేజ్‎ల ద్వారా లింక్‎లు పంపి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇటివలే జోగుళాంబ గద్వాల్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా మొత్తం బెట్టింగ్ మాటున జరుగుతున్న అసలు దందా బట్టబయలు అయింది. బెట్టింగ్ డబ్బుల కోసం భూములు, వాహనాలు, బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టించుకోవడం, అనంతరం వాటిని సొంతం చేసుకునే వ్యవహారం జిల్లాలో సంచలనంగా మారింది. ఇటివలే ముగిసిన ఐపీఎల్ మ్యాచ్‎ల ప్రారంభం నుంచి ఈ దందా జోరుగా సాగిందని పోలీసుల విచారణలో తేలింది. బెట్టింగ్ నిర్వాహణకు ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ క్రియెట్ చేశారు. లాగిన్ వివరాలు ప్రత్యేకంగా లింక్‎ల ద్వారా పంపి నగదు డిపాజిట్ చేయడం, బెట్టింగ్‎లు పెట్టడం నిర్వహిస్తున్నారు. ఇక నిరక్షరాస్యుల కోసం ప్రత్యేకంగా వ్యక్తులను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా నగదు తీసుకొని బెట్టింగ్ కోసం వెబ్ సైట్‎లో మనీ డిపాజిట్ చేయిస్తున్నారు. ఇక కొంత మంది బెట్టింగ్ రాయుళ్ల దగ్గర డబ్బు లేకుంటే వారికి అప్పుల రూపంలో అరెంజ్ చేస్తున్నారు ఈ కేటుగాళ్లు. ఈ అప్పుల వ్యవహారంలో జోగుళాంబ గద్వాల్ జిల్లాకు చెందిన ఓ ఎస్సై కుమారుడు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అమాయకుల వద్ద నుండి భూములు, కార్లు, బైక్‎లు, బంగారు ఆభరణాలు కుదువపెట్టుకొని బెట్టింగ్‎ల కోసం వడ్డీలకు నగదు అందజేస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఆ ఎస్సై కూడా పలు ఆరోపణలతో ప్రస్తుతం ఎస్పీ ఆఫీసుకు అటాచ్ చేసినట్లు టాక్ నడుస్తోంది. వీరి పాత్రతో పాటు పలువురు రాజకీయ ప్రముఖలు ఇందులో భాగస్వామిగా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

బెట్టింగ్ దందాపై లోతైన దర్యాప్తు: జిల్లా ఎస్పీ రితిరాజ్

ఇక బెట్టింగ్ దందాపై ప్రత్యేక బృందంతో లోతైన దర్యాప్తు చేయిస్తున్నారు జిల్లా ఎస్పీ రితిరాజ్. ఈ వ్యవహారంలో ఎంతటి వారున్నా చర్యలు తప్పవంటూ ఆమె హెచ్చరిస్తున్నారు. గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్‎లో కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. అయిజ ప్రధాన కేంద్రంగా జిల్లా మొత్తం బెట్టింగ్‎లు సాగిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేయగా మరికొంత మంది పరారీలో ఉన్నట్లు ఎస్పీ రితిరాజ్ తెలిపారు. ప్రత్యేక దృష్టితో దర్యాప్తు కొనసాగుతోందని ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన పాత్ర ఎవరిది అనేది త్వరలోనే తేల్చుతామని ఆమె స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు తమ పిల్లలపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని తల్లితండ్రులకు పోలీసులు సూచిస్తున్నారు. దర్యాప్తు అనంతరం బాధితుల ప్రాపర్టీని తిరిగి రికవరీ చేస్తామని చెబుతున్నారు. ఇక ఈ వ్యవహారంలో ఎంతటి వారు ఉన్న ఉపేక్షించకుండా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…