CM Revanth: తెలంగాణ రాష్ట్ర గీతంపై ముగిసిన సమావేశం.. సీఎం రేవంత్‎కు విపక్షాలు చేసిన సూచనలివే

జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతానికి రాజకీయపక్షాలు, ఉద్యమకారులు ఆమోదం తెలిపారు. తెలంగాణ ఆవిర్భావించి దశాబ్దం పూర్తవుతున్న తరుణంలో రేవంత్ సర్కార్ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర గీతాన్ని, లోగోను, తెలంగాణ తల్లి విషయంలో కొన్ని మార్పులు చేసేందుకు సిద్దమైంది. దీనిపై వామపక్షాలు, ప్రజాసంఘాలు, ఉద్యమకారులతో తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించింది.

CM Revanth: తెలంగాణ రాష్ట్ర గీతంపై ముగిసిన సమావేశం.. సీఎం రేవంత్‎కు విపక్షాలు చేసిన సూచనలివే
Cm Revanth Reddy
Follow us

|

Updated on: May 30, 2024 | 7:37 PM

జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతానికి రాజకీయపక్షాలు, ఉద్యమకారులు ఆమోదం తెలిపారు. తెలంగాణ ఆవిర్భావించి దశాబ్దం పూర్తవుతున్న తరుణంలో రేవంత్ సర్కార్ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర గీతాన్ని, లోగోను, తెలంగాణ తల్లి విషయంలో కొన్ని మార్పులు చేసేందుకు సిద్దమైంది. దీనిపై వామపక్షాలు, ప్రజాసంఘాలు, ఉద్యమకారులతో తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర గీతం అంశాన్ని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రతిపాదించారు. ఆ తరువాత జయ జయ తెలంగాణ గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి, సింగర్ రేవంత్ బృందం పాడి వినిపించారు. ఈ పాటను విన్న సిపిఐ, సిపిఎం, తెలంగాణ జన సమితి, కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారులు, జేఏసీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు.

తెలంగాణ గీతంలో ముగ్దూం మోహిణుద్దీన్ పేరును జత పర్చాలని సిపిఐ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు కోరారు. దీనిపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. షేక్ బంధగీ, కొమురం భీం పేర్లు కూడా రాష్ట్ర గీతంలో పొందు పర్చేందుకు అంగీకారం తెలిపారు. ఇక తెలంగాణ రాజ ముద్రపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. లోగోపై కేబినెట్ సమావేశంతోపాటు, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నిర్ణయాన్ని ప్రకటిస్తాం అని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తి, అందరి అభిప్రాయాల తర్వాతే రాజముద్ర ప్రకటనపై తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలను ఈ ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పారు సీఎం రేవంత్. రాష్ట్ర గేయం, రాష్ట్ర రాజముద్ర విషయంలో అందరి నుంచి అభిప్రాయాలు తీసుకోవడంలో ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..