నాగ చైతన్య-శోభితల పెళ్లి.. అతిథులు వీరే!
03 December 2024
Basha Shek
టాలీవుడ్ హీరో, హీరోయిన్లు అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల మరికొద్ది గంటల్లో వివాహం బంధంతో ఒక్కటి కానున్నారు
బుధవారం (డిసెంబరు 4) అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా మూడు ముళ్ల బంధంతో వీరిద్దరూ ఒక్కటి కానున్నారీ లవ్ బర్డ్స్.
ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ రంగానికి సంబంధించిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
పుష్ప2 తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైన అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి చైతన్య పెళ్లి వేడుకకు రానున్నాడట.
అలాగే మెగా ఫ్యామిలీ, దగ్గుబాటి, నందమూరి ఫ్యామిలీల నుంచి కూడా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారట
ఇక ప్రభాస్, దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సహా చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఈ వేడుకలో సందడి చేయనున్నారట.
కాగా నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల వివాహ వేడుక పూర్తి హిందూ సంప్రదాయ పద్ధతిలో జరగనుందని నాగ్ తెలిపారు.
దాదాపు ఏడెనిమిది గంటల పాటు పెళ్లికి సంబంధించిన అన్ని క్రతువులు ఒకదాని తర్వాత ఒకటి నిర్వహించనున్నారట.
ఇక్కడ క్లిక్ చేయండి..