Telangana: వాయమ్మో..బైక్‌పై వెళ్లడమే పాపం అయిపోయింది.. ఒళ్ళు గగుర్పొడిచే సంఘటన..

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తూప్రాన్‌లో ద్విచక్ర వాహనం పైనుంచి టిప్పర్ లారీ దూసుకెళ్లగా వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. వాహనదారుడి రెండు కాళ్లు నుజ్జు నుజ్జు అయ్యాయి.

Telangana: వాయమ్మో..బైక్‌పై వెళ్లడమే పాపం అయిపోయింది.. ఒళ్ళు గగుర్పొడిచే సంఘటన..
Chevella Accident
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Velpula Bharath Rao

Updated on: Dec 03, 2024 | 7:21 PM

వరుస రోడ్డు ప్రమాదాలు కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. రోడ్డుమీదకి వెళ్ళామంటే తిరిగి ఇంటికి వస్తామో లేదో అన్న పరిస్థితులు దాపరించాయి. మనం సరిగా వెళుతున్న ఏ వాహనం ఏటు నుంచి వచ్చి ప్రాణాలు తీస్తుందో తెలియని దుస్థితి వచ్చింది. చేవెళ్లలో జరిగిన ఓ ప్రమాదపు ఘటనే ఇందుకు ఉదాహరణ.. తాజాగా తూప్రాన్‌లో తన పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళుతున్నటువంటి సమయంలో ఓ టిప్పర్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. అంతేకాకుండా ఆ వాహనాన్ని కొద్ది దూరం ఈడ్చుకుంటూ వెళ్లేసరికి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం పూర్తిగా ఖాళీ బూడిదైయింది. వాహనదారుడి రెండు కాళ్లు నుజ్జు నుజ్జు అయ్యాయి.

తూప్రాన్‌లో ద్విచక్ర వాహనం పైనుంచి టిప్పర్ లారీ దూసుకెళ్లగా వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. దశరథ అనే వ్యక్తి ఓ పరిశ్రమంలో పని చేసుకుంటూ ఇస్త్రీ దుకాణాన్ని నడిపించుకుంటున్నాడు. రోజు మాదిరిగానే పరిశ్రమలకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో నరసాపూర్ చౌరస్తా వద్ద వేగంగా వస్తున్న టిప్పర్ లారీ దశరథ్ నడుపుతున్న ద్విచక్ర వాహనంపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ద్విచక్ర వాహనం పూర్తిగా మంటలు చెలరేగి బూడిద కాగా దశరథ తీవ్రంగా గాయాల పాలయ్యాడు. ఈ ప్రమాదంలో అతని రెండు కాళ్లు నుజ్జునుయ్యాయి. అనంతరం అక్కడి నుంచి స్థానిక హాస్పిటల్‌కి తరలించగా హుటాహుటిన హైదరాబాద్‌కు తీసుకువెళ్లాలని అక్కడి వైద్యులు చెప్పడంతో హైదరాబాదులో హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే దశరథకు ముగ్గురు కుమారులు కాగా రెండు సంవత్సరాల క్రితం భార్య చనిపోయినట్లు సమాచారం. ఈ వరుస రోడ్డు ప్రమాదాలు కుటుంబాలలో తీరని విషాదాలను నింపుతోంది.

వీడియో ఇదిగో: 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి