AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Crime: కన్నకొడుకు క్రూరత్వం.. డబ్బుల కోసం కన్నతల్లిపై పెట్రోల్ పోసి.. అంతే కాకుండా

కష్టకాలంలో కన్నవాళ్లను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకే వారిపై దాడి(attack) చేశాడు. డబ్బు కోసం అక్కసు పెంచుకుని తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అంతటితో ఆగకుండా అడ్డొచ్చిన తండ్రినీ విచక్షణారహితంగా కర్రతో కొట్టాడు....

TS Crime: కన్నకొడుకు క్రూరత్వం.. డబ్బుల కోసం కన్నతల్లిపై పెట్రోల్ పోసి.. అంతే కాకుండా
fire
Ganesh Mudavath
|

Updated on: Mar 28, 2022 | 9:50 AM

Share

కష్టకాలంలో కన్నవాళ్లను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకే వారిపై దాడి(attack) చేశాడు. డబ్బు కోసం అక్కసు పెంచుకుని తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అంతటితో ఆగకుండా అడ్డొచ్చిన తండ్రినీ విచక్షణారహితంగా కర్రతో కొట్టాడు. ఈ ఘటనలో తల్లి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ (Telangana) లోని సిద్దిపేట జిల్లా గోవిందాపూర్‌ గ్రామానికి చెందిన మైసయ్య, పోశవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కూతురు సంతానం. వీరి చిన్న కుమారుడు గతంలో జరిగిన ఓ ప్రమాదంలో చనిపోయాడు. పెద్దకొడుకు బాలమల్లు తల్లిదండ్రులతో కాకుండా విడిగా ఉంటున్నాడు. మైసయ్య తనకున్న 3 గుంటల భూమిని (Land) విక్రయించాడు. వచ్చిన డబ్బులో బాలమల్లుకు లక్ష రూపాయలు ఇచ్చి, మరో లక్ష రూపాయలను తన వద్ద ఉంచుకున్నాడు. ఆ డబ్బు కూడా తనకే కావాలంటూ బాలమల్లు.. తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. ఆరోగ్యం బాగా లేదని, ఆస్పత్రి ఖర్చులకు డబ్బు అవసరముందని మైసయ్య చెప్పినా బాలమల్లు వినిపించుకోలేదు.

ఆదివారం ఉదయం తల్లిదండ్రుల ఇంటికి వచ్చి మళ్లీ గొడవపడ్డాడు. తల్లిని తీవ్రంగా కొట్టి, ఆమె దగ్గర ఉన్న డబ్బులను లాక్కున్నాడు. అనంతరం తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటలు తాళలేక పోశవ్వ కేకలు వేయడంతో మైసయ్య మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాడు. అడ్డొచ్చిన తండ్రిపై కూడా కర్రతో దాడి చేశాడు. అప్రమత్తమైన గ్రామస్తులు దంపతులిద్దరినీ 108 లో గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోశవ్వ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read

Markets: నష్టాలతో వారం ప్రారంభం.. నెగెటివ్‌లో ట్రేడ్ అవుతున్న సూచీలు..

Rich Indians Migrating: పౌరసత్వం వదులుకుని ఆ దేశాలకు వెళ్లిపోతున్న భారతీయులు.. ఎందుకో తెలుసా..

Viral Video: నాకూ ఒకటి కావాలి.. వైరల్ వీడియోపై ఆనంద్ మహీంద్ర అద్భుతమైన రియాక్షన్..!