Snake Hulchul: ఏసీ నుంచి వింత శబ్దాలు.. ఓపెన్ చేసి చూస్తే షాక్.. ఇంట్లో నుంచి పరుగే పరుగు..

| Edited By: Surya Kala

Nov 02, 2023 | 10:46 AM

ఆ ఇంటి యజమాని చల్లదనం కోసం ఏసి స్విచ్ ఆన్ చేసాడు. ఆ ఏసి లో నుంచి శబ్దాలు వస్తున్నాయి. ఏదో తెల్లని పొడి ఉన్న దానిని చూసిన ఇంటి యజమాని ఏసి కి ఏమైంది. ఏమైనా సాంకేతిక పరమైన ప్రాబ్లెమ్ ఉందేమో అని ఏసి మెకానిక్ కు కాల్ చేశారు. ఈ రోజు ఏసి టెక్నీషియన్ వచ్చి ఏసి మెషిన్ బోర్డు ఊడ దీసాడు. అంతే దెబ్బకు ఆ ఇంట్లో వాళ్ళతో పాటు ఏసి మెకానిక్ కూడా గుండె జారినంత పని అయ్యింది. ఒక్కసారి వాళ్ళు తేరుకొని చూసే సరికి ఏసి లో హాయ్ గా సేద తీరుతూ ఒక త్రాచు పాము కనిపించింది.

Snake Hulchul: ఏసీ నుంచి వింత శబ్దాలు.. ఓపెన్ చేసి చూస్తే షాక్.. ఇంట్లో నుంచి పరుగే పరుగు..
Snake In Ac
Follow us on

ఏసీలో త్రాచు పాము ఫ్యామిలీ పెట్టేసినట్లు ఉంది. ఒక్కసారిగా ఏసీ నుంచి వింత శబ్దాలు రావడంతో కుటుంబ సభ్యులు టెక్నీషియన్ కోసం పరుగులు పెట్టారు. టెక్నీషియన్ ఏసి ఓపెన్ చేయగా.. ఆ శబ్దానికి గల కారణం తెలిసి ఇంట్లో వాళ్ళు షాక్ తో బయటకు పరుగు పెట్టారు. ఎందుకంటే ఆ ఏసీలో కాపురం పెట్టేసింది తాచుపాము. అవును ఇప్పటి వరకు చీమలు మట్టితో కష్ట పడి నిర్మించుకునే పుట్టల ఆవాసాలను పాములు ఆక్రమించుకుని తమ నివాసాలుగా చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే.. అయితే గత కొంతకాలంగా పాములు కూడా ట్రెండ్ మార్చేశాయి. అవి కూడా భిన్న ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తున్నాయి. బస్సులు, రైళ్లు, బైకులు కూడా ఎక్కుతున్నాయి. ఇప్పుడు నివాసాలుగా ఫ్రిడ్జ్ ను ఎసిలను చేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదా శివుని పాలెం గ్రామంలోని గౌతమ్ రెడ్డి అనే యజమాని ఇంటిలోని ఏసి లో దూరి త్రాచు పాము నివాసం ఏర్పరుచుకుంది. గత కొద్ది రోజులుగా వాతావరణం చల్లగా ఉండటంతో ఏసి స్విచ్ ఆన్ చెయ్యడం లేదు.  అయితే గత కొన్ని రోజులుగా పగలు ఉష్ణో గ్రతలు పెరిగి.. రాత్రుళ్లు చలి గా ఉంటుంది. దీంతో ఆ ఇంటి యజమాని చల్లదనం కోసం ఏసి స్విచ్ ఆన్ చేసాడు. ఆ ఏసి లో నుంచి శబ్దాలు వస్తున్నాయి. ఏదో తెల్లని పొడి ఉన్న దానిని చూసిన ఇంటి యజమాని ఏసి కి ఏమైంది. ఏమైనా సాంకేతిక పరమైన ప్రాబ్లెమ్ ఉందేమో అని ఏసి మెకానిక్ కు కాల్ చేశారు. ఈ రోజు ఏసి టెక్నీషియన్ వచ్చి ఏసి మెషిన్ బోర్డు ఊడ దీసాడు.

అంతే దెబ్బకు ఆ ఇంట్లో వాళ్ళతో పాటు ఏసి మెకానిక్ కూడా గుండె జారినంత పని అయ్యింది. ఒక్కసారి వాళ్ళు తేరుకొని చూసే సరికి ఏసి లో హాయ్ గా సేద తీరుతూ ఒక త్రాచు పాము కనిపించింది. ఆ త్రాచు పాము కుబుసం కూడా ఏసి లోనే విడిచిపెట్టింది. దీని కారణంగానే కుబుసం తెల్లని పొడిగా మారి ఏసి ఆన్ చేసినప్పుడు బయటకు పడుతుంది. అంతే కాదండోయ్…అసలు ఈ పాము ఏసి లోకి ఎలా వచ్చిందా అని పరిశీలిస్తే… ఇంటి చుట్టూ పొలాలు ఉండటం వల్ల ఎలుకలను తినేందుకు వచ్చిన త్రాచు పాముకు ఏసి నుంచి బయటకు వెళ్ళే వాటర్ పైపు ప్రహరీ గోడ నుంచి బయటకు ఉండటంతో ఆ పైపు నుంచి త్రాచు పాము ఏసి లోకి ప్రవేశించింది. అలా ఆ త్రాచు పాము ఏసి మెషిన్ ను ఆవాసం గా ఏర్పరచుకుని ఉంటుంది.
ఏసి బాగుచేసెందుకు వచ్చిన టెక్నీషియన్ ఆ పామును చంపి ఏసి క్లీన్ చేసి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఆ ఇంటి వాళ్ళు భయంతో వణికిపోయారు. వామ్మో ఏసి లోకి కూడా త్రాచు పాము వస్తే ఎలా..? అంటూ బిక్కు బిక్కు మంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..