Telangana: కరెంట్ రీడింగ్ తీసేందుకు మీటర్ వద్దకు వచ్చిన అధికారి.. ఒక్కసారిగా ట్విస్ట్..
డోర్నకల్ మండలం ముల్కలపల్లిలో విద్యుత్ మీటర్‌లో దాగిన పాము ఒక్కసారిగా బయటకు రావడంతో విద్యుత్ అధికారి షాక్‌కు గురయ్యారు. బిల్లు వేయడానికి వెళ్లిన రంగారావు క్షణం ఆలస్యం చేసినా కాటు పడి ఉండేది. విద్యుత్ మీటర్‌లోకి పాము దూరిన విషయాన్ని ఆ ఇంటి వాళ్లు కూడా గమనించలేదు.

తెలంగాణలోని డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో ఇటీవల ఓ కరెంట్ మీటర్ రీడింగ్ అధికారి తృటిలో ప్రమాదం నుంచి తప్పించ్చుకున్నారు. అక్కడి ఓ వినియోగదారుడి ఇంటి వద్ద ఉన్న విద్యుత్ మీటర్‌లో ఒక పాము దూరింది. అది మీటర్ బాక్స్‌లో దాగి ఉండటాన్ని ఎవరూ గమనించలేదు. ఆ సమయంలో రొటీన్ తనిఖీల కోసం గ్రామానికి వచ్చిన విద్యుత్ అధికారి రంగారావు, మీటర్ రీడింగ్ తీసే ప్రయత్నం చేశాడు. ఇంతలో ఒక్కసారిగా లోపల నుంచి పాము బయటకు వచ్చింది. ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే పాము కాటేసే అవకాశం ఉండడంతో ఆయన భయంతో దూరంగా వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి వచ్చి కర్రలతో పామును చంపడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే పాము మీటర్ బాక్స్ నుంచి జారుకుని పొలాల వైపు పారిపోయింది. దీంతో అక్కడి ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వీడియో దిగువన చూడండి…




