Telangana: స్కూటీలో నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని చూడగా షాకింగ్ దశ్యం
వర్షం కురిసిందంటే చాలు ఎక్కడో దాగున్న పాములన్నీ రోడ్లపైకి వస్తున్నాయి. వచ్చినవి వచ్చినట్లు ఉంటాయా.? ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులోకి రావడం, సోషల్ మీడియా విస్తృతి పెరగడంతో పాములకు సంబంధించిన వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ సంఘటనకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతోంది..
భారీ వర్షాలు, అడవుల నరికివేత కారణం ఏదైనా ఇటీవల వణ్యప్రాణులు జనావాసాల్లోకి రావడం సర్వసాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా పాములు ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. వర్షం కురిసిందంటే చాలు ఎక్కడో దాగున్న పాములన్నీ రోడ్లపైకి వస్తున్నాయి. వచ్చినవి వచ్చినట్లు ఉంటాయా.? ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులోకి రావడం, సోషల్ మీడియా విస్తృతి పెరగడంతో పాములకు సంబంధించిన వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ సంఘటనకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతోంది..
వివరాల్లోకి వెళితే.. పాము.. హల్చల్ చేసింది.. రెండు గంటల పాటు చుక్కలు చూపెట్టింది.. స్కూటీ లోని కి వెళ్లి.. బయట కు రాకుండా అందులో చిక్కుంది.. తీయడానికి ప్రయత్నం చేసిన బెడిసికొట్టింది.. చివరకు.. మెకానిక్.. స్కూటీ విడి భాగాల తీయడం తో బయటపడింది పాము. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది. స్కైటీలోకి వెళ్లిన పామును ఎలా గుర్తించారు.? చివరికి ఏమైందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ వద్ద నిలిపి ఉన్న స్కూటీలోకి పాము దూరింది. పాతబస్టాండ్ సమీపంలో షబ్బీర్ అనే వ్యక్తికి చెందిన స్కూటీని తన షాప్ ముందు పార్క్ చేసి పెట్టాడు. స్కూటీ లో పాము దూరుతుండగా అది గమనించిన స్కూటీ యజమాని అప్రమత్తమయ్యారు. అప్పటికే తీయడానికి ప్రయత్నం చేశాడు.. కానీ.. స్కూటీ లోపటి వరకు వెళ్ళింది. దీంతో పక్కన ఉన్న మెకానిక్ తెలిపి, స్నేక్ క్యాచర్ కి సమాచారం అందించారు.
స్నేక్ క్యాచర్ స్కూటీ వద్దకు చేరుకొని మెకానిక్, క్యాచర్ గంటన్నర పాటు శ్రమించి బండి యొక్క విడి భాగాలు ఒక్కొక్కటి తొలగించిన పాము ఆచూకీ కనిపెట్టలేకపోయారు. చివరికి స్కూటీ నీ స్టార్ట్ చేసి ఎక్స్ లెటర్ సహాయంతో పెద్ద శబ్దం వచ్చేలా చేశారు. ఆ సౌండ్ తో ఒక్కసారిగా ఇంజిన్ లో దాక్కున చిన్న పాము బయటకి వచ్చింది. క్యాచర్ ఆ పామును గమనించి అక్కడ ఉన్న ఒక ప్లాస్టిక్ కవర్ చేతికి చుట్టుకొని పాము పిల్లను పట్టుకున్నాడు. పట్టుకున్న పామును బాటిల్‌లో బంధించి జన సంచారం లేని ప్రాంతంలో వదిలేశాడు.
స్కూటీ పార్క్ చేసిన ప్రదేశం ఎప్పుడు జన సంచారంతో నిండి ఉంటుంది. పామును పట్టుకునే ప్రయత్నంలో స్కూటీ వద్ద జనం గుమిగూడి ఆసక్తిగా తిలకించారు. అదే సమయం ట్రాఫిక్ జామ్ అయ్యింది. పామును పట్టుకోవడం తో స్కూటీ యజమాని ఊపిరి పీల్చుకున్నాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..