Khairatabad Ganesh: కొలువుదీరిన ఖైరతాబాద్ గణనాథుడు.. భారీగా తరలివచ్చిన భక్తజనం..

Shaik Madar Saheb

|

Updated on: Sep 18, 2023 | 2:10 PM

Khairatabad Ganesh: భాగ్యనగరంలో గణేశ్ ఉత్సవ శోభ నెలకొంది. హైదరాబాద్ వ్యాప్తంగా వేలాది మండపాల్లో గణనాధులు కొలువుదీరారు. ఖైరతాబాద్ మహా గణపతి దగ్గర సందడి మొదలైంది. ఖైరతాబాద్ గణనాథుడికి తొలిపూజను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపతికి పద్మశాలి సంఘం తరపున జంధ్యం, కండువా సమర్పించారు. 75 అడుగుల భారీ కండువాను సమర్పించింది పద్మశాలి సంఘం.

Khairatabad Ganesh: భాగ్యనగరంలో గణేశ్ ఉత్సవ శోభ నెలకొంది. హైదరాబాద్ వ్యాప్తంగా వేలాది మండపాల్లో గణనాధులు కొలువుదీరారు. ఖైరతాబాద్ మహా గణపతి దగ్గర సందడి మొదలైంది. ఖైరతాబాద్ గణనాథుడికి తొలిపూజను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపతికి పద్మశాలి సంఘం తరపున జంధ్యం, కండువా సమర్పించారు. 75 అడుగుల భారీ కండువాను సమర్పించింది పద్మశాలి సంఘం. కండువా, జంధ్యం వేసిన తర్వాత తొలి పూజ మొదలైంది. అనంతరం వేద మంత్రోచ్చరణల మధ్య ఖైరతాబాద్ గణేశుడికి ప్రాణ ప్రతిష్ఠాపనోత్సవం నిర్వహించారు.. ఈ మహాక్రతువు తొలి పూజను గవర్నర్‌ తమిళిసై‌, మంత్రి తలసాని‌, హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి నిర్వహించారు. ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహాన్ని భారీగా 63 అడుగులలో ఏర్పాటు చేశారు. దశమహా విద్య గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనమిచ్చాడు. కుడివైపు పంచముఖ లక్ష్మీనరింహస్వామి.. ఎడమ వైపు వీరభద్ర స్వామి దర్శనమివ్వనున్నారు. ఖైరతాబాద్ గణపయ్య స్వామి దర్శన కోసం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో ఖైరతాబాద్ లో సందడి నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Sep 18, 2023 09:59 AM