Viral: లైవ్‌లో మహిళా రిపోర్టర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి.. రిపోర్టర్‌ ను అక్కడ తాకిన వ్యక్తి.

Viral: లైవ్‌లో మహిళా రిపోర్టర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి.. రిపోర్టర్‌ ను అక్కడ తాకిన వ్యక్తి.

Anil kumar poka

|

Updated on: Sep 18, 2023 | 10:00 AM

తాజాగా ఓ మహిళా రిపోర్టర్‌కు ఎదురైన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. లైవ్‌లో రిపోర్టింగ్ చేస్తున్న ఓ మహిళా రిపోర్టర్‌ను.. ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడు. వెనక నుంచి వచ్చి ఆమె వెనకభాగాన్ని అసభ్యకరంగా తాకాడు. ఈ తతంగం మొత్తం లైవ్‌లో రికార్డయింది. ఈ వీడియో చూసిన పోలీసులు.. నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 12 న స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో మహిళా జర్నలిస్ట్ ఇసా బాలాడో వార్తలు రిపోర్ట్ చేస్తుండగా..

తాజాగా ఓ మహిళా రిపోర్టర్‌కు ఎదురైన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. లైవ్‌లో రిపోర్టింగ్ చేస్తున్న ఓ మహిళా రిపోర్టర్‌ను.. ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడు. వెనక నుంచి వచ్చి ఆమె వెనకభాగాన్ని అసభ్యకరంగా తాకాడు. ఈ తతంగం మొత్తం లైవ్‌లో రికార్డయింది. ఈ వీడియో చూసిన పోలీసులు.. నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 12 న స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో మహిళా జర్నలిస్ట్ ఇసా బాలాడో వార్తలు రిపోర్ట్ చేస్తుండగా.. వెనక నుంచి ఓ వ్యక్తి వచ్చి ఆమె వెనుక భాగంపై చేయి వేశాడు. మీది ఏ ఛానల్ అంటూ ప్రశ్నించాడు. ఈ ఘటనతో లైవ్‌లో వార్తలు చెబుతున్న ఇసా బాలాడో ఒక్కసారిగా షాక్ అయింది. అయితే లైవ్‌లో ఉండడంతో వార్తలను కొనసాగించింది. టీవీ స్టూడియోలో ఉన్న యాంకర్ నాచో షాక్ అయి ఆమెతో మాట్లాడారు. ఆ వ్యక్తి మీ వెనుక బాగాన్ని తాకాడా అని ప్రశ్నించారు. దానికి ఆమె అవును అని సమాధానం చెప్పింది. దీంతో కోపంతో ఊగిపోయిన యాంకర్.. కెమెరాను ఆ నిందితుడి వైపు చూపించాలని వారికి సూచించాడు. దీంతో కెమెరామెన్.. కెమెరాను ఆ వ్యక్తి వైపు తిప్పాడు. అయితే తాను ఏ తప్పు చేయలేదని ఆ వ్యక్తి సమర్థించుకున్నాడు. చివరికి అక్కడి నుంచి వెళ్తూ మహిళా రిపోర్టర్ జుట్టును తాకాడు. పోలీసులు రంగంలోకి దిడి అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఆ మహిళా రిపోర్టర్ పనిచేస్తున్న టీవీ ఛానల్ స్పందించింది. ఇలాంటి లైంగిక వేధింపుల ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఘటనలో బాధితురాలైన ఇసా బాలాడోకు అండగా ఉన్నట్లు తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..