Hyderabad: సికింద్రాబాద్‌లోని అల్ఫా హోటల్‌ సీజ్‌.. అపరిశుభ్ర ఆహారం తిని పలువురు అస్వస్థత

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని ప్రముఖ హోటళ్లలో ఒకటైన ఆల్ఫా హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు ఆదివారం (సెప్టెంబర్‌ 17) సీజ్ చేశారు. ఆల్ఫా హోటల్‌లో నిత్యం వేలాది మంది ఆహారాలను కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ నిత్యం రోటీ, మటన్‌ కీమా, బిర్యానీ లెక్కకు మించి అమ్ముడు పోతుంటాయి. టీ నుంచి బిర్యానీ వరకు అన్ని రకాల ఫుడ్‌ వెరైటీలు ఇక్కడ దొరుకుతాయి. తాజాగా కొందరు యువకులు అక్కడ రోటీ, మటన్‌ కీమా ఆరగించారు. అనంతరం తీవ్ర..

Hyderabad: సికింద్రాబాద్‌లోని అల్ఫా హోటల్‌ సీజ్‌.. అపరిశుభ్ర ఆహారం తిని పలువురు అస్వస్థత
Secunderabad Alpha Hotel
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 18, 2023 | 11:05 AM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని ప్రముఖ హోటళ్లలో ఒకటైన ఆల్ఫా హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు ఆదివారం (సెప్టెంబర్‌ 17) సీజ్ చేశారు. ఆల్ఫా హోటల్‌లో నిత్యం వేలాది మంది ఆహారాలను కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ నిత్యం రోటీ, మటన్‌ కీమా, బిర్యానీ లెక్కకు మించి అమ్ముడు పోతుంటాయి. టీ నుంచి బిర్యానీ వరకు అన్ని రకాల ఫుడ్‌ వెరైటీలు ఇక్కడ దొరుకుతాయి. తాజాగా కొందరు యువకులు అక్కడ రోటీ, మటన్‌ కీమా ఆరగించారు. అనంతరం తీవ్ర ఆశ్వస్థతకు గురయ్యారు. దీంతో వారు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అపరిశుభ్ర వాతావరణంతో పాటు నాణ్యత లేని ఆహార పదార్ధాలను వినియోగదారులకు సరఫరా చేస్తుండటంలో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

నాణ్యత లేని ఆహారాన్ని అధిక ధరలకు విక్రయించడంతోపాటు జనాల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారంటూ సెప్టెంబర్ 15వ తేదీన కొంత మంది ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన పలు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రత్యక్షమయ్యాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు హోటల్‌ను పరిశీలించి శాంపిల్స్‌ను సేకరించారు. అంతేకాకుండా హోటల్‌ గదిలోని వంటగది అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నట్లు గుర్తించారు. అస్వస్థతకు గురైన యువకులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వాది ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

హోటల్‌లో సేకరించిన ఆహార్‌ శాంపిల్స్‌ను నాచారంలోని స్టేట్‌ఫుడ్ ల్యాబోరేటరీకి అధికారులు పంపించారు. ఈ క్రమంలో ఆదివారం మరోమారు అధికారుల బృందం హోటల్‌లో తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో పలు కీలక విషయాలను అధికారులు సేకరించారు. నాణ్యమైన ఆహారాన్ని వినియోగదారులకు అందించడంలో హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పరిశుభ్రతను పాటించడంలో నిబంధనలు ఉల్లంగించినట్లు గుర్తించారు. అనంతరం తదుపరి చర్యలు తీసుకునేంతవరకూ హోటల్‌ను మూసివేయాలని అధికారులు యాజమన్యాన్ని ఆదేశించారు. ఈ కేసును అడిషనల్‌ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి హోటల్ యాజమాన్యానికి ఫెనాల్టీ విధిస్తామని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని అల్ఫా హోటల్‌తోపాటు పలు హోటళ్లు గుట్టు చప్పుడు కాకుండా ఇలా నాణ్యతలేని ఆహారాన్ని వినియోగదారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి జీహెచ్ఎంసీ అధికారులు ఆల్ఫా హోటల్‌ను మూసివేశారు. నగరంలో ప్రతి చోట ప్రతి వస్తువులోనూ కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. కొన్ని వెలుగులోకి వస్తున్నాయి.. మరికొన్నేమో గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం సాగిస్తున్నాయి. అధికారులు ప్రతి చోట ఇలాగే దాడులు చేసి నకిళీ గాళ్లను మట్టుబెట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.