AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khairatabad Ganesh: వైభవంగా ఖైరతాబాద్ మహా గణేశుడికి ప్రాణ ప్రతిష్ఠాపనోత్సవం.. బారులు తీరిన భక్తులు

Khairatabad Ganesh 2023: ఖైరతాబాద్ మహా గణేశుడికి పూజలు ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్చరణల మధ్య ఖైరతాబాద్ గణేశుడికి ప్రాణ ప్రతిష్ఠాపనోత్సవం నిర్వహించారు.. ఈ మహాక్రతువు తొలి పూజను గవర్నర్‌ తమిళిసై‌, మంత్రి తలసాని‌, హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి నిర్వహించారు.

Khairatabad Ganesh: వైభవంగా ఖైరతాబాద్ మహా గణేశుడికి ప్రాణ ప్రతిష్ఠాపనోత్సవం.. బారులు తీరిన భక్తులు
Khairatabad Ganesh
Shaik Madar Saheb
| Edited By: |

Updated on: Oct 17, 2023 | 12:32 PM

Share

Khairatabad Ganesh 2023: ఖైరతాబాద్ మహా గణేశుడికి పూజలు ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్చరణల మధ్య ఖైరతాబాద్ గణేశుడికి ప్రాణ ప్రతిష్ఠాపనోత్సవం నిర్వహించారు.. ఈ మహాక్రతువు తొలి పూజను గవర్నర్‌ తమిళిసై‌, మంత్రి తలసాని‌, హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి నిర్వహించారు. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. వినాయక చవితి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఖైరతాబాద్‌ వినాయకుడి దర్శనానికి తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి అధికంగా ఉంది. కళాకారుల ఆటపాటలతో ఖైరతాబాద్ సందడిగా మారింది. ఈ ఒక్క రోజే లక్ష మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది. దీంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని బారీకేడ్లు, క్యూలైన్లను ఏర్పాటు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గణేష్ చతుర్థి అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అంగరంగ వైభవంగా జరుపుకుంటామని హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ తెలిపారు.

ఏటా విభిన్న రూపాల్లో దర్శణమిచ్చే మహా గణపతి ఈ ఏడాది శ్రీ దశ మహా విద్యాగణపతిగా దర్శనమిస్తున్నారు. ఖైరతాబాద్ గణేశుడి తొలి పూజలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఖైరతాబాద్ గణేశుడి వద్ద భక్తుల సందడి మొదలైంది. మొత్తం 63 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. కుడివైపు పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి..ఎడమవైపు వీరభద్ర స్వామి విగ్రహాలు ఉన్నాయి..మరోవైపు ఖైరతాబాద్ గణేషుడు రికార్డ్‌లకు కేరాఫ్‌గా మారాడు..45- 50 టన్నుల బరువుతో 63 అడుగుల ఎత్తులో పూర్తి మట్టి విగ్రహంగా వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించాడు.

బాలాపూర్‌లో ఆధ్యాత్మిక శోభ..

గణేష్ నవరాత్రి సందర్భంగా హైదరాబాద్‌ బాలాపూర్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉత్సవాల నేపథ్యంలో బాలాపూర్ నణనాథుడిని ఉత్సవ సమితి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. సాయంత్రం ఆరు గంటలకు తొలిపూజ నిర్వహించనున్నారు. భక్తులు భారీగా రానున్న నేపథ్యంలో ఉత్సవ సమితి అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి 18 ఫీట్ల ఎత్తుతో గణనాథుడిని‌ ఏర్పాటు చేశారు. పంచముఖి నాగేంద్రునిపై కూర్చుని బాలాపూర్ గణేషుడు దర్శనం ఇవ్వనున్నారు.

అంతటా ఆధ్యాత్మిక శోభ

ఇదిలాఉంటే.. హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేష్ చతుర్థి శోభ నెలకొంది. వాడవాడలా కొలువైన గణేష్ విగ్రహాల వద్ద భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో నగరవ్యాప్తంగా సందడి నెలకొంది. అంతేకాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బొజ్జ గణపయ్యలు కొలువుదీరారు. అంతటా గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..