AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: దుప్పులను చంపి మాంసం అమ్ముతున్న ముఠా.. కటకటాల పాలైన ఆరుగురు స్మగ్లర్లు

తాడ్వాయి మండలం బోడిలింగాల గ్రామ పరిసర అడవుల్లో దుప్పులను ఉచ్చులతో హతమార్చారు. వన్య ప్రాణులను వేటాడి మాంసం విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అశోక్, సతీష్ అనే ఇద్దరు వ్యక్తుల ఇళ్లలో దుప్పి మాంసం లభ్యమైంది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా మరో నలుగురు ఉన్నట్లు విచారణలో తెలిపారు.

Telangana: దుప్పులను చంపి మాంసం అమ్ముతున్న ముఠా.. కటకటాల పాలైన ఆరుగురు స్మగ్లర్లు
Forest Officials
G Peddeesh Kumar
| Edited By: Surya Kala|

Updated on: Dec 27, 2023 | 12:37 PM

Share

అటవీ జంతువులను హత మార్చే కేటుగాళ్ల పాపం పండింది.. ఉచ్చులతో దుప్పులను హతమార్చి మాంసం విక్రయాలు జరుపుతున్న ఆరుగురు స్మగ్లర్లు కటకటాల పాలయ్యారు. ములుగు జిల్లా ఏజెన్సీలోఅటవీ జంతువుల వధ ఆగడం లేదు. ఉచ్చులు, విద్యుత్ తీగలతో వాటి ప్రాణాలు మింగేస్తున్న స్మగ్లర్లు వాటి మాంసం విక్రయాలతో సొమ్ము చేసుకుంటున్నారు.

అటవీ జంతువుల వేట అడ్డు అదుపు లేకుండా జరుగుతుంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ సిబ్బంది నిఘా ముమ్మరం చేశారు. అడవుల్లో తనిఖీలు చేపట్టిన ఫారెస్ట్ అధికారులు వన్యప్రాణులను వేటాడిన ఆరుగురు వేటగాళ్లను, దుప్పితోలు, మాంసము, ఉచ్చులు స్వాధీనం చేసుకున్నారు. తాడ్వాయి మండలం బోడిలింగాల గ్రామ పరిసర అడవుల్లో దుప్పులను ఉచ్చులతో హతమార్చారు. వన్య ప్రాణులను వేటాడి మాంసం విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు తనిఖీలు చేపట్టారు.

అశోక్, సతీష్ అనే ఇద్దరు వ్యక్తుల ఇళ్లలో దుప్పి మాంసం లభ్యమైంది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా మరో నలుగురు ఉన్నట్లు విచారణలో తెలిపారు. వారి వద్ద దుప్పి మాంసం లభ్యమయింది.  అనంతరం అడవుల్లో ఎక్కడెక్కడ ఉచ్చులు అమర్చారో వెలికి తీశారు. లింగాల సమీప అడవులో ఉచ్చులను స్వాధీనం చేసుకున్నారు. వారు హతమార్చిన ఉచ్చులు స్వాధీనం చేసుకోవడం తో పాటు వేటగాళ్లు హతమార్చిన దుప్పి తోలును స్వాధీనం చేసుకున్నారు. ఓ మైనర్ బాలుడి తో సహా ఆరుగురి పై వన్య ప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు.. వన్య ప్రాణుల వేట ఆపకపోతే కటిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!