AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచం మొత్తంలో తెలంగాణ కల్చర్ వెరీ స్పెషల్.. ‘సీతాల భవాని పండుగ’ గురించి మీకు తెలుసా..?

ప్రపంచం మొత్తంలో తెలంగాణ కల్చర్ వెరీ స్పెషల్. తెలంగాణలోని ఫెస్టివల్స్ నేచర్‌తో లింక్ అయ్యి ఉంటాయి. ఒక్కో ఏరియాలో ఒక్కోలా..

ప్రపంచం మొత్తంలో తెలంగాణ కల్చర్ వెరీ స్పెషల్.. 'సీతాల భవాని పండుగ' గురించి మీకు తెలుసా..?
Sitla Festival
Ram Naramaneni
|

Updated on: Jul 14, 2021 | 10:35 AM

Share

ప్రపంచం మొత్తంలో తెలంగాణ కల్చర్ వెరీ స్పెషల్. తెలంగాణలోని ఫెస్టివల్స్ నేచర్‌తో లింక్ అయ్యి ఉంటాయి. ఒక్కో ఏరియాలో ఒక్కోలా.. నేచర్‌ను పూజిస్తుంటారు తెలంగాణ పీపుల్. మెయిన్‌గా ట్రైబల్స్ ఫెస్టివల్స్ అయితే… చూడ్డానికి రెండు కళ్లు చాలవు.  గిరిజనులు సంప్రదాయం ప్రకారం.. ఆషాఢ మాసంలో తొలకరి విత్తనాలు వేసిన తర్వాత సీతాల భవాని పండుగ జరుపుకుంటారు. ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని బిల్యా తాండలో. సీతాల దేవిని గిరిజనులు అమితంగా ఆరాధిస్తారు. వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని పూజిస్తారు. సీతాల భవాని పండగలో భాగంగా… ఆవులు, గొర్రెలు, మేకలను సీతాల భవానికి సమర్పిస్తారు. ఆ తర్వాత… నవధాన్యాలను పశువుల మీద చల్లి దాటిస్తారు. పంటలు పుష్కలంగా పండాలని, పశు సంపద పెరగాలని, అటవీ సంపద పెరగాలని గిరిజనులు సీతల భవానీకి మొక్కులు చెల్లిస్తారు. తండాలో ఎవరూ రోగాల బారిన పడకుండా… అందరూ బాగుండాలని మొక్కులు చెల్లిస్తారు గిరిజనులు.

సీతాల భవానీ పండగకు మరో ప్రత్యేకత ఉంది. గిరిజన వేషధారణలతో మహిళలు పాటలు పాడుతూ ఉంటే… పురుషులు డప్పుకొడుతూ… తండా పొలిమేర వరకు వెళ్తారు. అక్కడ పూజల అనంతరం.. గిరిజన మహిళలు… రౌండ్‌గా ఉండి… పాటలు పాడుతూ… నృత్యం చేస్తారు. ఆ పాటల్లో కూడా ప్రకృతి, వ్యవసాయం, పశు సంపదపై వారికున్న ప్రేమ కనబడుతుంది. ప్రకృతి నుంచి ఆవాసాన్ని, ఆహారాన్ని పొందిన మనిషి .. ఆ ప్రకృతికి ప్రణమిల్లటం అనాది నుంచి వస్తున్న ఒక సంప్రదాయం. అదే ఆనవాయితీ అయింది. ఆఖరికి సంస్కృతిగా స్థిరపడింది. ఇంకా నేలతోనూ, నింగితోనూ, నీరుతోనూ ప్రత్యక్ష సంబంధాలు తెగిపోని చోట… ప్రకృతిని ప్రేమించే, ఆరాధించే సంస్కృతిని మనం ఇప్పటికీ చూడొచ్చు. ఇప్పుడు మన్య ప్రాంతంలో నెలకొన్న సీతాల సందడి అలాంటి సంస్కృతికి ఆనవాలు.

Also Read: కత్తి మహేష్ మృతిపై అనుమానాలు.. విచారణకు ఆదేశించిన సర్కార్.. అతడిపై పోలీసుల ఫోకస్

ఆన్‌లైన్‌ బెట్టింగ్ సెంటర్‌గా తిరుపతి.. వందల మందిని బకరా చేసి… లక్షలు దోచేసిన ముఠా