Singareni Elections: సింగరేణి ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ.. కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
సింగరేణి యాజమాన్యం హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. సింగరేణి యాజమాన్యం చేసిన రిక్వెస్ట్‌ను కొట్టివేసింది హైకోర్టు. దీనిపై వాదనలు వినిపించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, బొగ్గుగని కార్మిక సంఘం, కేంద్ర చీఫ్ లేబర్ కమిషనర్, డిప్యూటీ, రీజినల్ లేబర్ కమిషనర్‌లకు నోటీసులు జారీచేసింది హైకోర్టు. విచారణను ఈనెల 11 కు వాయిదా వేసింది..

సింగరేణి, అక్టోబర్ 7: సింగరేణి ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు నిన్నటి నుంచి నామినేషన్ల పర్వం కూడా కంటిన్యూ అవుతుంది. సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించడం తో విచారణ ఈనెల 11 కు వాయిదా పడింది. ఉత్కంఠత మధ్యే సింగరేణి ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుంది. ఇప్పటికే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు వాయిదా వేయాలని .. కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలిపే వరకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలంటూ సింగరేణి యాజమాన్యం హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. సింగరేణి యాజమాన్యం చేసిన రిక్వెస్ట్‌ను కొట్టివేసింది హైకోర్టు. దీనిపై వాదనలు వినిపించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, బొగ్గుగని కార్మిక సంఘం, కేంద్ర చీఫ్ లేబర్ కమిషనర్, డిప్యూటీ, రీజినల్ లేబర్ కమిషనర్‌లకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. విచారణను ఈనెల 11 కు వాయిదా వేసింది.
సింగరేణి ఎన్నికల నిర్వహణను అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు వాయిదా వేయాలని సింగరేణి సంస్థ యాజమాన్యం హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ ను సింగిల్ జడ్జి ధర్మాసనం కొట్టివేసింది. అక్టోబర్‌లో ఎన్నికలు జరపాల్సిందేనని స్పష్టం చేసింది. దీనిపై సింగరేణి యాజమాన్యం హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు, దసరా, దీపావళి వంటి ముఖ్యమైన పండగలు ఉన్నాయని తెలిపింది. ఆరు జిల్లాల పరిధి లో 43 వేల మంది సింగరేణి ఓటర్లు ఉండడంతో, ఎన్నికల నిర్వహణ కు దాదాపు 700 మంది సిబ్బంది అవసరమని పిటిషన్‌లో తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నెలరోజుల్లో సింగరేణి ఎన్నికలు నిర్వహిస్తామని, అప్పటివరకు గడువు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిస్థితుల్లో సింగరేణి ఎన్నికలు సాధ్యం కాదన్నారు. ఇరుపక్షా ల వాదనలను విన్న ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ విచారణను ఈనెల 11 కు వాయిదా వేసింది.
ఇప్పటికే షెడ్యుల్ ప్రకారం .. నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు కార్మికులకు మెయిల్స్ పంపడంతో ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నిన్న, ఇవాళ నామినేషన్లను స్వీకరిస్తున్నారు. హైదరాబాద్ లోని లేబర్ ఆఫీసు లో ఏఐటీయూసీ, సీఐటీయూ నామినేషన్లు దాఖలు చేసింది. బీఎంఎస్ ఇవాళ నామినేషన్లు వేయనుంది. ఇవాళ నామినేషన్ల స్వీకరణకు చివరిరోజు కావడంతో ఇంకా ఎన్ని నామినేషన్లు వస్తాయనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా సింగరేణి ఎన్నికల నిర్వహణ పై ఉత్కంఠ తొలగాలంటే 11వ తేదీ వరకు వెయిట్ చేయాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
