Telangana: తెలంగాణలో ‘మేనిఫెస్టో’ల పండుగ.. ఓటర్లను ఆకట్టుకునేందుకు కొత్త ఎత్తుగడలు.. సరికొత్త పథకాలు.!
మేనిఫెస్టో...పార్టీలకు పవిత్రగ్రంథం..కొత్త స్కీములు..కొత్త పథకాలు..ఎంత ఎక్కువ వరాలు ప్రకటిస్తే..అధికారం అంత గ్యారంటీ. ఓటర్లను ఆకట్టుకోవడానికి పార్టీలన్నీ తమ మేనిఫెస్టోలను ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. వినూత్న పథకాలను తెరమీదకి తెచ్చి ఓటర్లకు గాలం వేస్తున్నారు. తెలంగాణలో ప్రధాన పార్టీలు అదే పనిలో పడ్డాయి. తెలంగాణలో రేపో..మాపో..ఎన్నికల నగారా మోగనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు..

హైదరాబాద్, అక్టోబర్ 7: మేనిఫెస్టో…పార్టీలకు పవిత్రగ్రంథం..కొత్త స్కీములు..కొత్త పథకాలు..ఎంత ఎక్కువ వరాలు ప్రకటిస్తే..అధికారం అంత గ్యారంటీ. ఓటర్లను ఆకట్టుకోవడానికి పార్టీలన్నీ తమ మేనిఫెస్టోలను ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. వినూత్న పథకాలను తెరమీదకి తెచ్చి ఓటర్లకు గాలం వేస్తున్నారు. తెలంగాణలో ప్రధాన పార్టీలు అదే పనిలో పడ్డాయి. తెలంగాణలో రేపో..మాపో..ఎన్నికల నగారా మోగనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను ఆకట్టుకునేలా ప్రణాళిక రచిస్తున్నారు. అధికారంలోకి రావాలంటే..కేవలం ప్రచారమే సరిపోదు. అన్నీ వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా పథకాలు ఉండాలి. అప్పుడే ఆ పార్టీలు అధికారం చేరువవుతుందనే ప్రచారం ఉంది. అందుకే పార్టీలు హామీలు ఇవ్వడంలో పోటీపడుతున్నాయి. గతంలో కంటే భిన్నంగా ఉచిత పథకాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నాయి ప్రధానపార్టీలు.
తెలంగాణలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ అక్టోబర్ 16వ తేదీన అందరి మతి పోయేలా అద్భుతమైన సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ మేనిఫెస్టోలో ప్రకటించబోతున్నా రని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌లు కూడా బీఆర్‌ఎస్ మేనిఫెస్టో ప్రకటించేవరకూ వేచి చూడాలని కోరుతున్నారు. ఢిల్లీ పార్టీల మాటలు విని మోసపోవద్దని..అంతకంటే మంచి పథకాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచిస్తున్నారంటూ లీకులు కూడా ఇచ్చేశారు మంత్రి కేటీఆర్. ఇక ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్లతో పాటు మహాలక్ష్మి స్కీమ్, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు వంటి ఆరు గ్యారంటీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను కూడా జాగ్రత్తగా తయారుచేస్తోంది. కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధ్యక్షతన గాంధీభవన్‌లో పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. ఇక తాజాగా కాంగ్రెస్ ఓ అడుగు ముందుకేసి ఆడపిల్ల పెళ్లికి కల్యాణలక్ష్మినగదుతో పాటు తులం బంగారం కూడా ప్రతిపాదిస్తోంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశముంది.
గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో మేనిఫెస్టోను రూపొందించిన అనుభవం ఉన్న జి.వివేక్‌ని ఈసారి కూడా మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా నియమించింది బీజేపీ. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బీజేపీ మేనిఫెస్టో కమిటీలో ఉన్నారు. రైతులు, యువత, మహిళలను ఆకట్టుకునే పథకాలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గెలుపోటములను నిర్ణయించడంలో మేనిఫెస్టోలు కీలకమే అయినా అమలు చేయగలిగే పార్టీలవైపే ఓటర్లు మొగ్గుచూపుతారని ఇప్పటికే అనేకసార్లు రుజువైంది. కాగా, ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మున్ముందు ఎలాంటి జనరంజక పథకాలను ప్రకటిస్తారోనని తెలంగాణ ప్రజల్లో సర్వత్రా చర్చ జరుగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
