నేడు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివార్ల కల్యాణం
వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయంలో ఈరోజు రాజరాజేశ్వర స్వామివార్ల కల్యాణం జరగనుంది. కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆలయ కల్యాణ మండపంలో ఉదయం 10.56 గంటలకు రాజన్న కల్యాణం జరగనుంది. స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతలకు అర్చనలు, అభిషేకాలు, ధ్వజారోహణం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆలయంలో సాయంత్రం శివ పురాణ ప్రవచనాలు చేయనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి హోమం, ఉపాసన, బలిహరణం నిర్వహించనున్నారు. పెద్దసేవలో భాగంగా స్వామివారి ఊరేగింపు […]

వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయంలో ఈరోజు రాజరాజేశ్వర స్వామివార్ల కల్యాణం జరగనుంది. కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆలయ కల్యాణ మండపంలో ఉదయం 10.56 గంటలకు రాజన్న కల్యాణం జరగనుంది. స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతలకు అర్చనలు, అభిషేకాలు, ధ్వజారోహణం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆలయంలో సాయంత్రం శివ పురాణ ప్రవచనాలు చేయనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి హోమం, ఉపాసన, బలిహరణం నిర్వహించనున్నారు. పెద్దసేవలో భాగంగా స్వామివారి ఊరేగింపు నిర్వహించనున్నారు. ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కల్యాణ మహోత్సవం సందర్భంగా అధికారులు ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసి భక్తులకు శీఘ్రదర్శనం అమలు చేస్తున్నారు. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.



