AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసలైన ధమాకా.. రూ. వంద కొట్టు కోడిని పట్టు.. లక్కు దక్కితే మేకపోతు మీ స్వంతం..!

దసరా వస్తుందంటే వస్త్ర వ్యాపారులు, లిక్కర్ వ్యాపారులు బంపర్ ఆఫర్లు ప్రకటించడం చూస్తుంటాం..! పెద్ద పెద్ద హార్డింగ్‌లు, ప్రకటనలతో వినియోదారులను ఆకట్టుకోవడం కోసం వింత వింత ప్రచారాలు చేస్తుంటారు. తాజాగా పల్లెటూరి జీవనానికి తగ్గట్లు వారికి దసరా కిక్కు తగిలేలా.. వరంగల్ జిల్లాలోని ఓ గ్రామంలో డిఫరెంట్ గా లక్కీ డ్రా ప్రవేశపెట్టారు.

అసలైన ధమాకా.. రూ. వంద కొట్టు కోడిని పట్టు.. లక్కు దక్కితే మేకపోతు మీ స్వంతం..!
Dasara Draws Unique Offer
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Sep 26, 2025 | 6:28 PM

Share

దసరా వస్తుందంటే వస్త్ర వ్యాపారులు, లిక్కర్ వ్యాపారులు బంపర్ ఆఫర్లు ప్రకటించడం చూస్తుంటాం..! పెద్ద పెద్ద హార్డింగ్‌లు, ప్రకటనలతో వినియోదారులను ఆకట్టుకోవడం కోసం వింత వింత ప్రచారాలు చేస్తుంటారు. తాజాగా పల్లెటూరి జీవనానికి తగ్గట్లు వారికి దసరా కిక్కు తగిలేలా.. వరంగల్ జిల్లాలోని ఓ గ్రామంలో డిఫరెంట్ గా లక్కీ డ్రా ప్రవేశపెట్టారు. ఫస్ట్ ప్రైజ్ మేకపోతు, సెకండ్ ప్రైజ్ మద్యం ఫుల్ బాటిల్, మూడో ప్రైజ్ కాటన్ బీర్లు.. ఇంకా ఎలాంటి ఆఫర్లు ప్రకటించాడో తెలుసా..!

వరంగల్ జిల్లాలో దసరా ధమాకా పేరుతో ఓ యువకుడు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. 100 రూపాయలు చెల్లిస్తే 5 బహుమతులు ఇస్తామంటూ పర్వతగిరి మండలం అన్నారం తండాకు చెందిన భూక్య విగ్నేష్ అనే యువకుడు దసరా బోనాంజ ఆఫర్లు ప్రకటించారు. వంద రూపాయలు చెల్లించి ఒక టోకెన్ తీసుకుంటే దసరా రోజు లక్కీ డ్రా తీస్తామని తెలిపారు. ఈ లక్కీ డ్రాలో లక్కు తగలిగిన వారికి మొదటి బహుమతిగా మేకపోతు, రెండవ బహుమతిగా మద్యం ఫుల్ బాటిల్, 3వ బహుమతి కాటన్ బీర్లు, 4వ బహుమతిగా 2 పట్టుచీరలు, ఐదవ బహుమతిగా 2 నాటు కోడి పుంజులు ఇస్తామని ప్రకటించాడు.

ఏకంగా ఓ ప్లెక్సీ తయారుచేసి ప్రచారం చేపట్టాడు. దసరా పండగ సందర్భంగా ఈ యువకుడు చేపట్టిన వినూత్న కార్యక్రమం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. టోకెన్లు తీసుకునేందుకు జనం పెద్ద ఎత్తున ఆసక్తిని చూపుతున్నారు.

వీడియో చూడండి.. 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు