AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మఫ్టీలో ఆకతాయిలు, పోకిరీల ఆటకట్టిస్తున్న షీ టీమ్.. ఇకపై వారికి వణుకే..!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోకిరిలకు వణుకు పుట్టిస్తున్నారు పోలీసులు. బైక్ లపై ర్యాష్ డ్రైవింగ్ మహిళలు, యువతులను వేధిస్తున్న పోకిరీలపై షీ టీమ్ కొరడాఝుళిపిస్తున్నారు. పోకిరీల వేధింపుల బారినపడుతున్న మహిళలు, యువతులకి షీ టీమ్స్ అండగా నిలుస్తున్నాయి. బాధితులు నుంచి ఫిర్యాదు అందిన వెంటనే కార్యాచరణ చేపట్టి.. పోకిరీల ఆగడాలను అరికడుతున్నారు. ఇబ్బందులకు గురి చేస్తున్న ఆకతయిలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పెటి కేసు నమోదు చేస్తున్నారు.

Telangana: మఫ్టీలో ఆకతాయిలు, పోకిరీల ఆటకట్టిస్తున్న షీ టీమ్.. ఇకపై వారికి వణుకే..!
She Teams
G Sampath Kumar
| Edited By: Jyothi Gadda|

Updated on: Oct 06, 2024 | 11:55 AM

Share

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోకిరిలకు వణుకు పుట్టిస్తున్నారు పోలీసులు. బైక్ లపై ర్యాష్ డ్రైవింగ్ మహిళలు, యువతులను వేధిస్తున్న పోకిరీలపై షీ టీమ్ కొరడాఝుళిపిస్తున్నారు. పోకిరీల వేధింపుల బారినపడుతున్న మహిళలు, యువతులకి షీ టీమ్స్ అండగా నిలుస్తున్నాయి. బాధితులు నుంచి ఫిర్యాదు అందిన వెంటనే కార్యాచరణ చేపట్టి.. పోకిరీల ఆగడాలను అరికడుతున్నారు. ఇబ్బందులకు గురి చేస్తున్న ఆకతయిలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పెటి కేసు నమోదు చేస్తున్నారు.

పోకిరిలకు వణుకు పుట్టిస్తున్న పోలీసులు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆకతాయిలు, పోకిరీల భరతం పడుతున్నారు షీ టీమ్‌. జిల్లాలోని ఇల్లంతకుంట మండలం ప్రభుత్వ కళాశాల వద్ద కొంత మంది పోకిరీలు బైక్ లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అమ్మాయిలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న షీ టీమ్ సభ్యులు మఫ్టీ లో కళాశాల వద్ద నిఘా ఉంచారు. పోకిరీలను అదుపులోకి తీసుకుని పెట్టి కేసు నమోదు చేశారు. మహిళలు, విద్యార్థులను వేధించినా, వెంబడించినా, సామాజిక మధ్యమాల ద్వారా ఇబ్బంది కలిగినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇల్లంతకుంట మండల పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వద్ద ఉదయం, సాయంత్రం సమయంలో బైక్ లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ విద్యార్ధినిలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. జిల్లా షీ టీమ్ కి సమాచారం ఇవ్వగా జిల్లా షీ టీం సిబ్బంది కాలేజ్ వద్ద మఫ్టీలో కాపుకాచారు. బైక్ పై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న కొంత మంది ని రెడ్ హ్యాండెడ్ పట్టుకొని వారిపై పెట్టి కేసు నమోదు చేశారు.

మహిళలు, చిన్న పిల్లల రక్షణ విషయంలో జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. జిల్లాలో విద్యాసంస్థల వద్ద రద్దీగల ప్రదేశాల్లో షీ టీమ్ సిబ్బంది మఫ్టీలో నిరంతరం నిఘా పెంచారు. విద్యార్థిలను వేధిస్తున్న ఇప్పటి వరకు పోకిరీలపై 37 కేసులు నమోదు చేసి కట కటలకు పంపారు. కేసులు నమోదు చేయడం తో పాటు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.మూడు నెలల వ్యవధిలో మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న 22 మందిని అదుపులోకి తీసుకొని జ కౌన్సెలింగ్ నిర్వహించి మరల వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు.

మహిళలు యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా జిల్లా షీ టీమ్ ని సంప్రదించాలని, నేరుగా సంప్రదించలేని వారు షీ టీమ్ నంబర్ 87126 56425 డయల్ 100 కు సమాచారం ఇవ్వగలరు మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచడతాయని పోలీసులు తెలిపారు. పోలీసులు తీసుకుంటున్న చర్యలతో పోకిరిల ఆగడాలు తగ్గాయి.. నిరంతరం షీ టీం నిఘా పెంచింది..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..