Yadadri Bhuvanagiri: డాక్టర్లు అంటే ఇలా ఉండాలి.. ఏం చేశారో తెలుసా?
వైద్యో నారాయణ హరి అంటారు మన పెద్దలు. దేవుడితో సమానంగా భావించే వైద్యుడే మన వద్దకు వచ్చి వైద్య సేవలు అందిస్తే ఎలా ఉంటుంది. అలాగే ఓ మెడికల్ కళాశాల విద్యార్థులు దాతృత్వాన్ని చాటుకున్నారు. ఓ గ్రామంలో మూడు ఇళ్ల చొప్పున ఒకరు.. మెడికల్ కళాశాల విద్యార్థులు దత్తత తీసుకున్నారు. మూడేళ్ల పాటు వైద్య సేవలు అందించేందుకు మెడికోలు ముందుకు వచ్చారు.
Yadadri Bhuvanagiri: వైద్యో నారాయణ హరి అంటారు మన పెద్దలు. దేవుడితో సమానంగా భావించే వైద్యుడే మన వద్దకు వచ్చి వైద్య సేవలు అందిస్తే ఎలా ఉంటుంది. అలాగే ఓ మెడికల్ కళాశాల విద్యార్థులు దాతృత్వాన్ని చాటుకున్నారు. ఓ గ్రామంలో మూడు ఇళ్ల చొప్పున ఒకరు.. మెడికల్ కళాశాల విద్యార్థులు దత్తత తీసుకున్నారు. మూడేళ్ల పాటు వైద్య సేవలు అందించేందుకు మెడికోలు ముందుకు వచ్చారు.
విద్యార్థుల్లో ముఖ్యంగా మెడికల్ కాలేజీ విద్యార్థుల్లో సామాజిక సేవ దృక్పథాన్ని అలవర్చేందుకు ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లా బొమ్మలరామరం మండలం ప్యారారం గ్రామాన్ని ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థులు దత్తత తీసుకున్నారు. అయితే ప్యారారం గ్రామంలో 279 ఇళ్లు ఉండగా, 1159 మంది ప్రజలు ఉన్నారు. ఉస్మానియా ఆసుపత్రి వైద్యులతోపాటు మెడికల్ కాలేజీకి చెందిన 84 మంది విద్యార్థులు గ్రామానికి చేరుకొని పరిశీలించారు. మూడు ఇళ్లకు ఒకరు చొప్పున మొత్తం గ్రామంలో ఇంటింటి సర్వేచేసి ఓపీ విభాగంలో అందరినీ పరీక్షించి, మందులు అందజేశారు. ప్రతీ నెలలో రెండో, నాలుగో శనివారాల్లో వైద్య పరీక్షలు నిర్వహించి సేవలు అందించాలని, మూడేళ్లపాటు దత్తత తీసుకొని వైద్య పరీక్షలు, సేవలు అందించాలని మెడికల్ కాలేజీ విద్యార్థులు నిర్ణయించారు.
అయితే గ్రామస్థుల అందరి ఆరోగ్య సమాచారం దత్తత తీసుకున్న వైద్యుల వద్ద ఉంటుంది. ఇందులో ఎవరికైనా బీపీ, షుగర్, ఇతర వ్యాధులు ఉన్నా వాటికి వైద్యంతోపాటు ఇతర చికిత్సలను అందజేసేందుకు వారు చర్యలు తీసుకుంటారు. ఉస్మానియా ఆస్పత్రి ప్రొఫెసర్ నీలిమ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పావని, మనీజా, రితిక ఆధ్వర్యంలో 84 మంది మెడికల్ కాలేజీ విద్యార్థులు ప్యారారం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. తమ గ్రామాన్ని ఉస్మానియా మెడికల్ కళాశాల విద్యార్థులు దత్తత తీసుకున్నందుకు మాజీ ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రవీందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.