Hyderabad: ఎయిర్‌పోర్టులో అనుమానంగా కనిపించిన వ్యక్తి.. లగేజ్ చెక్‌చేయగా కంగుతిన్న అధికారులు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి నుంచి ఏకంగా రూ.10 కోట్ల విలువైన 10.3 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని ఎయిర్‌పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో విదేశాల నుంచి బంగారం, గంజాయి వంటివి స్మగ్లింగ్ చేస్తున్న ఘటన ఎక్కువయ్యాయి. ఎన్ని సార్లు పట్టుబడుతున్నా ఇలా అక్రమంగా తరలించే వారిలో మాత్రం అస్సలు మార్పు రావట్లేదు. తాజాగా ఇలాగే అక్రమంగా గంజాయి తరలిస్తు మరో వ్యక్తి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి గంజాయిని స్వాదీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరానికి చెందిన హసీబ్ అనే వ్యక్తి గత కొన్ని రోజుల క్రితం వ్యక్తిగత పని కోసం దుబాయ్ వెళ్లాడు. గురువారం దుబాయ్ నుంచి తిరిగి వస్తూ తనతో పాటు 10.3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని తీసుకొచ్చాడు. ఎవరినీ అనుమానం రాకుంగా ఈ గంజాయిన నాలు బస్తాల్లో ప్యాకింగ్ చేసి తన లగేజ్‌తో రహస్యంగా దాచి పెట్టి తరలించాడు.
శంషాబాద్ చేరుకున్నాకా లగేజ్‌ను తీసుకొని బయటకు వెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఎయిర్‌పోర్టు సిబ్బంది ఆపి అతన్ని తనిఖీ చేశాడు. అప్పుడే తన లగేజ్‌లో ఉన్న రూ.10 కోట్ల విలువైన 10.3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని వెంటనే కస్టమ్స్ అధికారు దృష్టికి తీసుకెళ్లగా అక్కడి చేరుకున్న అధికారులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
