ఆర్మీ జవాన్‎కు 20 ఏళ్ల జైలు శిక్ష.. సుదీర్ఘకాలం కోర్టులో విచారణ.. అసలు కారణం ఇదే..

సాధారణంగా ఆర్మీ అంటేనే ప్రతి ఒక్కరికి అపారమైన అభిమానం ఉంటుంది. అలాంటి ఆర్మీ వృత్తిలో ఉన్న ఒక జవాన్‎కు సికింద్రాబాద్ కోర్టు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. 2017లో సికింద్రాబాద్లో ఉన్న ఒక లాడ్జ్‎లో ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డడు ఆ కీచక జవాన్. ఆర్మీ జవాన్‎గా పనిచేస్తున్న శ్రీధరన్ ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆర్మీ జవాన్‎కు 20 ఏళ్ల జైలు శిక్ష.. సుదీర్ఘకాలం కోర్టులో విచారణ.. అసలు కారణం ఇదే..
Secunderabad
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 29, 2024 | 4:19 PM

సాధారణంగా ఆర్మీ అంటేనే ప్రతి ఒక్కరికి అపారమైన అభిమానం ఉంటుంది. అలాంటి ఆర్మీ వృత్తిలో ఉన్న ఒక జవాన్‎కు సికింద్రాబాద్ కోర్టు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. 2017లో సికింద్రాబాద్లో ఉన్న ఒక లాడ్జ్‎లో ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డడు ఆ కీచక జవాన్. ఆర్మీ జవాన్‎గా పనిచేస్తున్న శ్రీధరన్ ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 2017లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి సుదీర్ఘకాలంగా పోలీసులు అనేక రకాల ఆధారాలు సేకరించారు. 2017 లోనే రిటైర్డ్ అయిన ఆర్మీ జవాన్ శ్రీధరన్ స్థానికంగా ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ తరుణంలోనే ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టి కేసులో రిటైర్డ్ ఆర్మీ జవాన్‎ను మార్కెట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‎కు తరలించారు. ఈ కేసు‎పై గతంలోనే చార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు సంబంధిత ఆధారాలను సేకరించి జావాన్‎కు శిక్షపడేలా చర్యలు తీసుకున్నారు.

ఒక బాలికను లాడ్జిలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. లాడ్జి నుండి బయటికి వచ్చిన బాలిక నేరుగా మార్కెట్ పోలీస్ స్టేషన్‎కు వెళ్లింది. మార్కెట్ పోలీసులకు జరిగిన విషయం మొత్తం చెప్పటంతో ఆర్మీ జవాన్ శ్రీధరన్‎పై అప్పటి మార్కెట్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత పోలీసులు అన్ని ఆధారాలను కోర్ట్‎కు పగడ్బందీగా సమర్పించడంతో రిటైర్డ్ ఆర్మీ జవాన్ శ్రీధరన్‎కు 20 ఏళ్లపాటు జైలు శిక్ష విధించింది స్పెషల్ కోర్టు. ఈ సంఘటనతో పలు మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా న్యాయస్థానాలు త్వరితగతిని పెండింగ్లో ఉన్న కేసులను కూడా పరిష్కరించాలని కోరుతున్నారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలంటే ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే ప్రజల్లో, సమాజంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గంజి.. అని చులకనగా తీసి పడేయకండి. దీని లాభాలు తెలిస్తే వదలరు..
గంజి.. అని చులకనగా తీసి పడేయకండి. దీని లాభాలు తెలిస్తే వదలరు..
నటుడితో రొమాంటిక్ సీన్స్‌.. భయంతో పురుగులు పెట్టిన హీరోయిన్.
నటుడితో రొమాంటిక్ సీన్స్‌.. భయంతో పురుగులు పెట్టిన హీరోయిన్.
అమెరికాలో దారుణం.. ఐదుగురిని కాల్చిచంపిన 50 ఏళ్ల వ్యక్తి..
అమెరికాలో దారుణం.. ఐదుగురిని కాల్చిచంపిన 50 ఏళ్ల వ్యక్తి..
గాల్లో ఎగురుతుండగా తెరుచుకున్న విమానం పైకప్పు.. భయంతో మహిళా..
గాల్లో ఎగురుతుండగా తెరుచుకున్న విమానం పైకప్పు.. భయంతో మహిళా..
ఇంట్లో దైవ చింతన బయట ప్రజల చెంతన. ఎంత ఎదిగినాఒదిగి ఉండడమే పవనిజమా
ఇంట్లో దైవ చింతన బయట ప్రజల చెంతన. ఎంత ఎదిగినాఒదిగి ఉండడమే పవనిజమా
'హీరోయిన్ అలా ప్రవర్తించిన తీరు దారుణం' అమలా పాల్ ఇలా చేసిందా.?
'హీరోయిన్ అలా ప్రవర్తించిన తీరు దారుణం' అమలా పాల్ ఇలా చేసిందా.?
ఉదయ్ కిరణ్ భార్య విషిత‌.. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.? వీడియో..
ఉదయ్ కిరణ్ భార్య విషిత‌.. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.? వీడియో..
ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.
ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.
కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్.
కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్.
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స