AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ప్రియుడు కాదు.. రాక్షసుడు.. పెళ్లికి ఒప్పుకోలేదని పట్టపగలే..

సికింద్రాబాద్‌లోని వారాసిగూడలో దారుణం వెలుగు చూసింది. పెళ్లి ఒప్పుకోలేదని తను ప్రేమించిన యువతిపై కక్ష పెంచుకున్న ఓ ప్రేమోన్మాది.. పట్టపగలు యువతి ఇంట్లోకి చొరబడి.. ఆమెను అతి కిరాతకంగా కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకన్న వారాసిగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: ప్రియుడు కాదు.. రాక్షసుడు.. పెళ్లికి ఒప్పుకోలేదని పట్టపగలే..
Hydrabad Crime
Anand T
|

Updated on: Dec 08, 2025 | 4:51 PM

Share

సికింద్రాబాద్‌లోని వారాసిగూడలో దారుణం వెలుగు చూసింది. పెళ్లి ఒప్పుకోలేదని తను ప్రేమించిన యువతిపై కక్ష పెంచుకున్న ఓ ప్రేమోన్మాది.. పట్టపగలు యువతి ఇంట్లోకి చొరబడి.. ఆమెను అతి కిరాతకంగా కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. వివరాల్లోకి వెళ్త.. శ్రీకాకుళం పలాసకు చెందిన పవిత్ర అనే బాలిక కుటుంబంతో కలిసి వారాసిగూడలో నివాసం ఉంటుంది. పవిత్ర ప్రస్తుతం ఇంటర్ చదువుతుంది. అయితే బాలాజీ నగర్‌కు చెందిన టైల్స్ పనిచేసే ఊమాశంకర్ అనే యువకుడితో ఆమెకు కొన్నాళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారింది. దీంతో కొన్నాళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఆదివారం పవిత్ర తల్లితండ్రులతో కలిసి విజయవాడ వెళ్ళింది. అయితే తల్లితండ్రుల్తో వెళ్లొద్దు అని ముందు రోజే ఉమాశంకర్ పవిత్రను వారించినట్టు తెలుస్తోంది. అయినా అవేవి పట్టించుకోకుండా పవిత్ర పేరెంట్స్‌తో కలిసి విజయవాడ వెళ్లి వచ్చింది. అయితే నేను చెప్పినా వినకుండా మీ తల్లితండ్రులతో వెళ్తావా అంటూ పవిత్రతో ఉమా శంకర్ ఇటీవల వాగ్వాదం పెట్టుకున్నాడు. దీంతో పెళ్ళికి ముందే ఇన్ని ఆంక్షలు పెడతావా.. నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటూ శంకర్‌తో పవిత్ర వాగ్వాదానికి దిగింది.

తనతో పెళ్లికి నిరాకరించడంతో పవిత్రపై కోపం పెంచుకున్న ఉమాశంకర్ ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. సోమవారం మధ్యాహ్నం నేరుగా యువతి ఇంట్లోకి వెళ్లిన ఉమాశంకర్ ఆమెతో గొడవ పడి.. ఇంట్లో ఉన్న కత్తి తీసుకొని పవిత్రపై దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన పవిత్ర అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత తన మొబైల్ ఫోన్ ను అక్కడే పడేసి పారిపోయాడు నిందితుడు ఉమాశంకర్.

విషయం తెలుసుకున్న బాధిత తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమెదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఉమాశంకర్ పరారీలో ఉన్నాడని.. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.