BIG BREAKING: తెలంగాణలో రేపట్నుంచి విద్యాసంస్థలు బంద్… ప్రభుత్వం కీలక ప్రకటన

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో బుధవారం నుంచి విద్యాసంస్థలు తాత్కాలికంగా బంద్ చేస్తున్నట్లు వెల్లడించింది.

BIG BREAKING: తెలంగాణలో రేపట్నుంచి విద్యాసంస్థలు బంద్... ప్రభుత్వం కీలక ప్రకటన
Telangana Schools
Follow us
Ram Naramaneni

| Edited By: Team Veegam

Updated on: Mar 23, 2021 | 7:09 PM

Telangana Schools:  తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో బుధవారం నుంచి విద్యాసంస్థలు తాత్కాలికంగా బంద్ చేస్తున్నట్లు వెల్లడించింది. వైద్య కళాశాలలు మినహాయించి.. రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యాలయాలు, హాస్టల్స్ కూడా మూసివేయనున్నారు.  ఈ మేరకు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రకటన చేశారు.  అయితే ఆన్‌లైన్ క్లాసులు యథాతథంగా జరగనున్నాయి. విద్యాసంస్థలు కరోనా విస్పోటన కేంద్రాలుగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నట్లు చెప్పింది. దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఈ తరహా నిర్ణయాలు తీసుకున్నాయని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ మరోసారి కోరలుచాస్తోంది. ముఖ్యంగా స్కూల్స్, గురుకులాల్లో కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఇప్పటికే 700 మంది విద్యార్థులకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వైద్యా ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా 10వ తరగతి లోపు పాఠశాలలను, గురుకులాలను, వసతిగృహాలను వెంటనే మూసివేస్తే మంచిందని సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనపై రివ్యూ చేసిన సీఎం కేసీఆర్.. స్కూల్స్ తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటన చేశారు.

తెలంగాణలో కొత్తగా 412 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో సోమవారం రాత్రి 8 గంటల వరకు 68,171 కరోనా నిర్ధారణ టెస్టులు చేయగా.. 412 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. కాగా సోమవారం వైరస్ కారణంగా  ముగ్గురు మృతి చెందినట్లు  వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1674కి చేరింది. కరోనా బారి నుంచి కొత్తగా 216 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,151 ఉన్నాయి. వీరిలో 1,285 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 103 కేసులు వెలుగుచూశాయి.

Also Read: Revanth Reddy Corona Positive: రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌.. స్వయంగా ట్వీట్ చేసిన కాంగ్రెస్ ఎంపీ

COVID Vaccine: కేంద్రం కీలక నిర్ణయం.. ఏప్రిల్‌ 1 నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!