COVID Vaccine: కేంద్రం కీలక నిర్ణయం.. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్
కొవిడ్ టీకాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు ప్రతి ఒక్కరి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది.

కొవిడ్ టీకాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు ప్రతి ఒక్కరి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. అర్హత ఉన్న వారందరినీ వెంటనే నమోదు చేసుకుని, టీకాలు వేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ ప్రకటన చేశారు.
“ఏప్రిల్ 1 నుంచి, 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ టీకా వేయాలని నిర్ణయించాం. అర్హత ఉన్న వారందరూ వెంటనే నమోదు చేసుకుని టీకాలు వేయించుకోవాలని మేము అభ్యర్థిస్తున్నాము. 45 ఏళ్లు పైబడిన వారందరూ వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కరోనా సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ తప్పనిసరి ” అని జవదేకర్ చెప్పారు.
కాగా, కోవిషీల్డ్ వ్యాక్సిన్ 2 వ మోతాదు తీసుకోవలసిన సమయాన్ని కూడా కేంద్రం సోమవారం సవరించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను 4-6 వారాల బదులు 4-8 వారాల మధ్య సెకండ్ డోస్ ఇవ్వాలని కోరింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ 2 వ మోతాదు 4-8 వారాల మధ్య మంచిదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు అభిప్రాయపడినట్లు ప్రకాష్ జవదేకర్ చెప్పారు.
కాగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ దడ పుట్టిస్తున్న విషయం తెలిసిందే. అనూహ్య రీతిలో కేసుల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంలో పాఠశాలలు, కళాశాలల్లో వ్యాధి వ్యాప్తి అధికంగా ఉంది. ఈ క్రమంలో వైరస్‌ను లైట్ తీసుకోకుండా.. సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు.
Also Read: Revanth Reddy Corona Positive: రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్.. స్వయంగా ట్వీట్ చేసిన కాంగ్రెస్ ఎంపీ