జయలలిత స్మారక మందిరంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ఫోటోలు ! ఇదెక్కడి వింత ?
తమిళనాడు మాజీ సీఎంలు దివంగత జయలలిత, ఎంజీఆర్ ల స్మారకార్థం నిర్మించిన మందిరంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా , ఇతర బీజేపీ నేతల ఫోటోలు దర్శనమిస్తున్నాయి. రానున్న
తమిళనాడు మాజీ సీఎంలు దివంగత జయలలిత, ఎంజీఆర్ ల స్మారకార్థం నిర్మించిన మందిరంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా , ఇతర బీజేపీ నేతల ఫోటోలు దర్శనమిస్తున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. బహుశా ఈ మందిరాన్ని చూడడానికి వచ్చే వారిని ప్రభావితం చేసేందుకు బీజేపీ నేతల ఫోటోలను కూడా ఏర్పాటు చేసినట్టు భావిస్తున్నారు. ఈ రాష్ట్రానికి జయలలిత చేసిన సేవలను, ఆమె త్యాగానికి గుర్తుగా ఈ మందిరాన్ని నిర్మించడం జరిగిందని, ఇదే నేపథ్యంలో ప్రధాని మోదీ నాయకత్వం కింద ఈ దేశానికి ఎన్నో ప్రాజెక్టులు లభించాయని రెవెన్యూ శాఖ మంత్రి ఆర్.బీ ఉదయ్ కుమార్ చెప్పారు. ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండగా మదురైలో ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఇక కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మదురైకి చెందినవారేనని, ఇందుకు తామెంతో గర్విస్తున్నామని ఆయన అన్నారు. అందుకే వీరి ఫోటోలను ఈ స్మారక మందిరంలో పెట్టామన్నారు. గత జనవరిలో ఈ మంత్రి ఆధ్వర్యంలోనే ఈ మందిరాన్ని నిర్మించారు. తిరుమంగళం లోని 12 ఎకరాల సువిశాల స్థలంలో దీని నిర్మాణం జరిగింది.
కాగా జయలలిత లోగడ రాష్ట్ర సీఎంగా ఉండగా పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. ‘అమ్మ’ పేరిట పేదలకు ఉచిత రేషన్, మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ వంటి పలు చర్యలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఏర్పాటు చేయడానికి బదులు బీజేపీ నేతల ఫోటోలను ఈ స్మారక మందిరంలో పెట్టడమేమిటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
మరిన్ని చదవండి ఇక్కడ :సూపర్ మార్కెట్ లో చిలిపిదొంగ..పట్టపగలు అందరూ చూస్తుండగానే దొంగతనం..వైరల్ అవుతున్న వీడియో..:Bird thief video.