Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రమండలం ఫ్యామిలీ టూర్, ఇంటికో రోబో, ప్రయాణానికి బోటు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి సంచలన హామీలు

మీది తమిళనాడా.? అయితే అదృష్టం మిమ్మల్ని వెతుకుంటూ వచ్చినట్లే..ఎందుకంటే జస్ట్‌ కొంతసేపు ఎండలో ఉండి నా కోసం ఓటు వేస్తే చాలు.. మీ అందరినీ చంద్రమండలానికి తీసుకెళ్తా అంటున్నారు ఓ నాయుకుడు.

చంద్రమండలం ఫ్యామిలీ టూర్, ఇంటికో రోబో, ప్రయాణానికి బోటు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి సంచలన హామీలు
Promises In Tamilnadu Assembly Elections Campaign
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 24, 2021 | 2:08 PM

Veriety promises in Tamilnadu elections:  మీది తమిళనాడా.? అయితే అదృష్టం మిమ్మల్ని వెతుకుంటూ వచ్చినట్లే..ఎందుకంటే జస్ట్‌ కొంతసేపు ఎండలో ఉండి నా కోసం ఓటు వేస్తే చాలు.. మీ అందరినీ చంద్రమండలానికి తీసుకెళ్తా అంటున్నారు ఓ నాయుకుడు.. ఏంటీ ఆశ్చర్చపోయారా..? అంతే మరీ ఎన్నికల్లో గెలవడం కోసం ఓ అభ్యర్థి ఇచ్చిన హామీ ఇదీ..అసలు ఇది సాధ్యమేనా? లేదంటే ఓటర్లను తిగరి వాళ్లను చేయడమా? తమిళనాట జరగనున్న ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థుల హామీలతో అక్కడి జనమే షాక్‌ అవ్వుతున్నారు..

తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు, అభ్యర్థులు వారిపై హమీల వర్షం కురిపిస్తున్నాయి. ఆల్ ఫ్రీ అంటూ ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలు విడుదల చేయగా.. అందుకు ధీటుగా స్వతంత్ర అభ్యర్థులు కూడా హామీల వర్షం కురిపిస్తున్నారు. అందరికంటే భిన్నంగా ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి తన నియోజకవర్గ ప్రజలకు సంచలన హామీలిచ్చారు. ఇంతవరకు దేశంలో ఏ అభ్యర్థి ఇవ్వని విధంగా హామీల వర్షం కురిపించారు. ఆ హామీలు విన్న ఓటర్లు అవాక్కవుతున్నారు. ఇక ప్రత్యర్థుల సంగతి చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఆ అభ్యర్థి ఇచ్చిన హామీలు తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. అలా ఉన్నాయి మరి మనోడు ఇచ్చిన హామీలు ఏంటో ఓ పరిశీలిద్దాం..

తమిళనాడులోని దక్షిణ మధురై నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న శరవరణ్ అనే వ్యక్తి.. తన నియోజకవర్గం కోసం స్పెషల్ మేనిఫెస్టోను రూపొందించాడు. ఇతకి సదరు అభ్యర్థి ఏయే హామీలిచ్చాడంటే..

  • నియోజకవర్గ ప్రజలందరిని బ్యాచ్ ల వారీగా చంద్రమండలానికి తరలించడం.
  • స్థానికంగా రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేయడం.
  • ఇళ్లలో ఆడవాళ్లకు పనిలో సాయంగా ఉండేందుకు ఇంటింటికీ ఓ రోబోను పంపిణీ చేయడం.
  • మధురైలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కాలువలు తవ్వించడమే కాకుండా.. ఇంటికో బోటు.
  • ఎండవేడి నుంచి నియోజకవర్గాన్ని కాపాడుకునేందుకు 300 అడుగుల ఎత్తులో కృత్రిమ మంచుకొండ నిర్మాణం.
  • ప్రజలు ఎంజాయ్ చేయడానికి కృత్రిమ సముద్రాన్నే సృష్టించి బీచ్ నిర్మాణం.
  • నియోజకవర్గ ప్రజలందరికీ ఐఫోన్ కూడా ఇస్తానని ప్రకటన.

శరవణన్‌ ఇచ్చిన హామీలు ఇవి.. తొలుత శరవరణ్ పలు రాజకీయ పార్టీల నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. ఎవ్వరూ తనకు అవకాశం ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసి ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాన పార్టీలకు పోటీ ఇచ్చేందుకు నమ్మశక్యం కాని హామీల వర్షం కురిపించాడు. ఇప్పటికే హామీల వర్షం కురిపిస్తున్నాయి అక్కడి పార్టీలు.. అలాంటి చోట స్వతంత్ర అభ్యర్థి ఇచ్చిన హామీ అందరినీ షాక్‌ గురి చేస్తోంది. ప్రస్తుతం శరవణన్ ఇచ్చిన హామీలు ఎన్నికల ప్రచారంలో వైరల్ అవుతున్నాయి.

మరి మధురై ప్రజలు శరవణన్ మాటలు నమ్ముతారా..? లేక అందరిలాగానే ఫ్రీ హామీలిస్తున్నాడని లైట్ తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా.. ప్రధాన పార్టీలిచ్చిన షాక్ తో డీలా పడకుండా.. వారికి రివర్స్ కౌంటర్ ఇచ్చేలా శరవణన్ హామీలిచ్చాడని రాజకీయ నేతలంటున్నారు. మరి చంద్రమండలం టూర్, రోబోలు, మంచుకొండలు, పడవలు, ఐఫోన్లు మనోడికి ఓట్లు రాల్చుతాయో లేదో అనేది వేచి చూడాలి.

మరోవైపు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉచితానుచితాలు మర్చిపోయి హామీలిస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. ఆరు ఆకాశాల్లో మూడు చందమామలు పెడతాం.. అన్నట్లుగా ఉంది పార్టీల తీరు..అడగని వాడిదే పాపం అన్నట్లు వరాలిచ్చేస్తున్నాయి. తమిళనాడులో ప్రాంతీయ పార్టీలకు మేమేం తక్కువ కాదంటోంది కమలదళం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కూటమి కట్టిన బీజేపీ… 20 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తోంది..అసెంబ్లీ ఎన్నికల కోసం కమలనాధులు విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో 50కి పైగా ప్రామిసెస్‌ ఉన్నాయి.

ఇందులో కొన్నింటిని చూస్తే .. ఎలక్షన్లలో ఇలాంటి వాగ్దానాలు కూడా చేయవచ్చా అనే డౌట్‌ రావచ్చు. బీజేపీ అధికారంలోకి వస్తే..తాము అధికారంలోకి వస్తే జల్లికట్టు ఆటగాళ్లను స్పోర్ట్స్‌ కోటాలో ఇచ్చే బెనిఫిట్స్ ఇస్తామని హామీ ఇచ్చింది. తమిళనాడుని ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్ ర్యాంక్‌కు తీసుకు వస్తుందట. దేవాలయాల పరిపాలనా వ్యవహారాలను హిందూ స్కాలర్లు, సన్యాసులతో ఏర్పాటు చేసిన బోర్డుకి అప్పగిస్తామని ప్రకటించారు కమలనాధులు. 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉన్న అమ్మాయిలకు ఉచితంగా టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్‌ కూడా ఇస్తారట.

Read Also… సర్పంచ్ వర్సెస్ ఎమ్మెల్యేః నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై అవినీతి ఆరోపణలు.. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళా సర్పంచ్