AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kerala Assembly Elections:ఇడుక్కి, త్రిసూర్‌,మలప్పురం, పాలక్కాడ్‌ జిల్లాలో మెజారిటీ సీట్లు గెల్చుకోనున్న యూడీఎఫ్‌

మరో రెండు వారాలలో జరగబోతున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌ కూటమి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలన్నీ చెబుతున్నాయి. మనోరమ న్యూస్‌-వీఎమ్ఆర్‌ నిర్వహించిన....

Kerala Assembly Elections:ఇడుక్కి, త్రిసూర్‌,మలప్పురం, పాలక్కాడ్‌ జిల్లాలో మెజారిటీ సీట్లు గెల్చుకోనున్న యూడీఎఫ్‌
Kerala Assembly Elections
Balu
|

Updated on: Mar 23, 2021 | 3:33 PM

Share

Kerala Assembly Elections: మరో రెండు వారాలలో జరగబోతున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌ కూటమి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలన్నీ చెబుతున్నాయి. మనోరమ న్యూస్‌-వీఎమ్ఆర్‌ నిర్వహించిన ప్రీపోల్‌ సర్వేలోనూ ఇదే ఫలితం వచ్చంది. అయితే మలప్పురం , పాలక్కాడ్‌, త్రిసూర్‌, ఇడుక్కి జిల్లాలలో మాత్రం వామపక్షాల కూటమికి ఎదురుదెబ్బ తగలనుంది. ఈ నాలుగు జిల్లాలలో ఉన్న 46 నియోజకవర్గాలలో యునైటెడ్‌ డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌ 32 స్థానాలలో విజయం సాధించవచ్చని సర్వే స్పష్టం చేసింది. అధికార ఎల్‌డీఎఫ్‌ కూటమి 14 స్థానాలలో గెలిచే ఛాన్సుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు ఒక్క సీటు కూడా దక్కే అవకాశాలు లేవు కానీ ఓటింగ్‌ శాతాన్ని మాత్రం పెంచుకోబోతున్నది. మలప్పురం, పాలక్కాడ్‌ జిల్లాలలో అయితే యూడీఎఫ్‌కు తిరుగులేదని సర్వే సారాంశం. మలప్పురం జిల్లాలో ఉన్న 16 అసెంబ్లీ నియోజకవర్గాలలో యూడీఎఫ్‌ 15 స్థానాలు గెల్చుకునే అవకాశం ఉంది. థవనూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మంత్రి కె.టి.జలీల్‌ మాత్రమే యూడీఎఫ్‌పై పై చేయి సాధించబోతున్నారు. యూడీఎఫ్‌ 48.22 శాతం ఓట్లు దక్కించుకుంటుంటే, ఎల్‌డీఎఫ్‌కు 39.15 శాతం ఓట్లు లభించబోతున్నాయి. ఎన్‌డీఎకు 9.34 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. కొండొట్టి, ఎరనాడు, నీలంబర్‌, వండూర్‌, పెరింతాల్‌మన్నా, మన్కడ, మలప్పురం, వెంగర, కొట్టక్కాల్‌ నియోజకవర్గాలలో యూడీఎఫ్‌ మొదటి స్థానం, ఎల్‌డీఎఫ్‌ రెండో స్థానంలో నిల్చోబోతున్నాయి. నిజానికి నీలంబర్‌ నియోజకవర్గం ఎల్‌డీఎఫ్‌ సిట్టింగ్ స్థానం. మంజేరి నియోజకవర్గంలో పోటీ హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది. 3.9 ఓట్ల శాతం ఆధిక్యతతో యూడీఎఫ్‌ గట్టెక్కవచ్చు. 1967 నుంచి ఇక్కడ యూడీఎఫ్‌లో భాగస్వామి అయిన ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ అభ్యర్థే గెలుస్తూ వస్తున్నాడు. అయితే సర్వేలో 55 శాతం మంది ప్రజలు ప్రస్తుత ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వానికి మంచి మార్కులు వేయడం చూస్తే మాత్రం పోటీ గట్టిగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరురంగడి నియోజకవర్గంలో కూడా అంతే! ఇక్కడ 44 ఓట్ల శాతంతో యూడీఎఫ్‌ ముందంజలో ఉంది. అయితే ఎల్‌డీఎఫ్‌ 41.10 ఓట్ల శాతంతో గట్టిపోటీనిచ్చే ఛాన్సుంది. పైగా కరోనా వైరస్‌ను నియంత్రించడంలోనూ, సంక్షేమ పథకాల అమలులోనూ ప్రస్తుత ప్రభుత్వం చక్కగా పని చేసిందనేది అక్కడి ఓటర్ల అభిప్రాయం. తిరూర్‌లో ఎల్‌డీఎఫ్‌ గెలిచే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయి. ఎల్‌డీఎఫ్‌-యూడీఎఫ్‌ మధ్య తేడా 0.97 శాతం ఓట్లే కావడంతో విజయం ఎవరిని వరిస్తుందో చెప్పడం ఒకింత కష్టమే! 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మలప్పురం జిల్లాలో యూడీఎఫ్‌కు 12 స్థానాలు లభిస్తే, ఎల్‌డీఎఫ్‌కు నాలుగు స్థానాలు దక్కాయి.

పాలక్కాడ్‌ జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాలలో యూడీఎఫ్‌ ఏడింటిని చేజిక్కించుకోబోతున్నది. అధికారపక్షం అయిదు స్థానాలతోనే సరిపెట్టుకోవలసి వస్తున్నది. ఇప్పుడు అందరి దృష్టి పాలక్కాడ్‌ నియోజకవర్గంపైనే ఉంది. కారణం అక్కడ బీజేపీ తరఫున మెట్రోమాన్‌ ఈ.శ్రీధరన్‌ పోటీ చేస్తుండటమే! ఈ ముక్కోణపు పోటీలో శ్రీధరన్‌ మూడో స్థానంలో నిలవబోతున్నారు. అలాగని బీజేపీని పూర్తిగా తీసిపారేయ్యడానికి లేదు.. ఎందుకంటే కేవలం ఏడు శాతం ఓట్లు మాత్రమే మూడు పార్టీల గెలుపోటములను నిర్దేశిస్తున్నాయి కాబట్టి. యూడీఎఫ్‌ 41.96 శాతం ఓట్లతో ముందుంటే, ఎల్‌డీఎఫ్‌ 37.75 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంది. ఎన్‌డీఏకు 19.71 శాతం ఓట్లు లభించనున్నాయి. పట్టాంబి సీటును ఎల్‌డీఎఫ్‌ మరోసారి నిలబెట్టుకోబోతున్నది. కాంగ్రెస్‌ అభ్యర్థిని ప్రకటించడంలో చేసిన జాప్యం ఎల్‌డీఎఫ్‌కు కలిసివస్తున్నది. అలాగే ఓట్టప్పాలమ్‌ కూడా ఎల్‌డీఎఫ్‌ పక్షాన నిలవనుంది. 1985 నుంచి కాంగ్రెస్‌ ఇక్కడ ఓడిపోతూనే వస్తున్నది.

త్రిసూర్‌ జిల్లాలో అధికార ఎల్‌డీఎఫ్‌ నాలుగు సిట్టింగ్‌ స్థానాలను కోల్పోతున్నది. మొత్తంమీద ఉన్న 13 నియోజకవర్గాలలో ఎనిమిది సీట్లు ఎల్‌డీఎఫ్‌ గెల్చుకుంటుందని సర్వే చెబుతోంది. ఈ జిల్లాలో యూడీఎఫ్‌కు అయిదు స్థానాలు గెల్చుకునే అవకాశాలున్నాయి. ఎల్‌డీఎఫ్‌ 41.85 శాతం ఓట్లతో ముందంజలో ఉంటే యూడీఎఫ్‌ 37.14 శాతం ఓట్లతో రెండోస్థానంలో ఉంది. ఎన్‌డీఎకు 19.52 శాతం ఓట్లు లభించే అవకాశం ఉంది. గురువాయూర్‌ నియోజకవర్గంలో పోటీ తీవ్రంగానే ఉండబోతున్నది. అయితే యూడీఎఫ్‌ అభ్యర్థి గట్టేక్కే ఛాన్సుంది. బీజేపీ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురికావడంతో ఆ ఓట్లు ఎటువైపు మళ్లుతాయన్నది ఆసక్తికరంగా ఉంది. త్రిసూర్‌, మనలూర్‌ నియోజకవర్గాలను ఎల్‌డీఎఫ్‌ నిలబెట్టుకోబోతున్నది. 2016 ఎన్నికల్లో యూడీఎఫ్‌ ఈ జిల్లాలో కేవలం ఒకే ఒక్క స్థానం గెల్చుకున్నది. ఇప్పుడు అయిదు సీట్లు గెల్చుకోబోతున్నదంటే ఇంప్రూవ్‌మెంటే!

ఇడుక్కి జిల్లా విషయానికి వస్తే ఇక్కడున్న అయిదు నియోజకవర్గాలు యూడీఎఫ్‌ పక్షానే వెళ్లబోతున్నాయి. యూడీఎఫ్‌ 41.48 శాతం ఓట్లతో మొదటి స్థానంలో ఉంటే, ఎల్‌డీఎఫ్‌ 35.46 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంది. ఎన్‌డీఎ 19.76 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉన్నప్పటికీ గత ఎన్నికలతో పోలిస్తే ఓట్ల శాతం బాగా పెంచుకుందనే చెప్పాలి. దేవిక్కులమ్‌ నియోజకవర్గంలో గట్టి పోటీ ఉన్నా యూడీఎఫ్‌ బయటపడుతుంది. ఈ నియోజకవర్గం నుంచి ఎన్‌డీఎలో భాగస్వామి అయిన అన్నా డీఎంకే అభ్యర్థి నామినేషన్‌ వేశారు. కానీ అది కాస్త తిరస్కరణకు గురైంది.

మరిన్ని చదవండి ఇక్కడ :నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న సమంత‌ ఓల్డ్‌ వీడియో.. చూసి ఫ్యాన్స్‌ షాక్‌..!: Samantha old viral video.

నీకు కడుపు పండాలీ అంటే చిన్నారిని బలివ్వాలీ అని చెప్పగానే నమ్మింది..!చివరికి ఇలా..:Women believes a child is sacrified Video.

 నవీన్‌ పొలిశెట్టిగా..అంటూ వార్నింగ్ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ..జాతిరత్నాల మధ్య చిచ్చు..:warning to Naveen Polishetty Video.