Telangana:’శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పూజించినందుకే కష్టాలు’.. పాఠ్యపుస్తకంలో తప్పుగా ముద్రణ.. స్పందించిన ఉన్నతాధికారులు
శ్రీకృష్ణుడు గీతను బోధించి యావత్ సమాజానికి బ్రతికే మార్గాన్ని సుగమం చేశారు. మానవులకు కలిగే కష్టాలకు, బాధలకు మూలం ఏంటో తెలుసుకునేందుకు సమస్త జ్ఞానాన్ని తన సందేశం ద్వారా జనులకు పంచారు. బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం ఇలా వివిధ దశల్లో ఎలా మెలగాలో శ్రీకృష్ణలీలల్లో చెబుతారు. ఇంతటి సమస్త శక్తిని తనలో ఐక్యం చేసుకొని జనాన్ని జాగరూకులను చేస్తూ నడిపించే జగన్నాధుడు అతడు.

శ్రీకృష్ణుడు గీతను బోధించి యావత్ సమాజానికి బ్రతికే మార్గాన్ని సుగమం చేశారు. మానవులకు కలిగే కష్టాలకు, బాధలకు మూలం ఏంటో తెలుసుకునేందుకు సమస్త జ్ఞానాన్ని తన సందేశం ద్వారా జనులకు పంచారు. బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం ఇలా వివిధ దశల్లో ఎలా మెలగాలో శ్రీకృష్ణలీలల్లో చెబుతారు. ఇంతటి సమస్త శక్తిని తనలో ఐక్యం చేసుకొని జనాన్ని జాగరూకులను చేస్తూ నడిపించే జగన్నాధుడు అతడు. ఇలాంటి శ్రీకృష్ణుడి గురించి తెలంగాణలో రాష్ట్రంలోని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యూకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అధికారులు తప్పుగా ముద్రించారు. ఐదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో మహాభారతానికి సంబంధం లేని అంశాన్ని చేర్చారు.
ఈ పుస్తకంలో పేర్కొన్న అంశాన్ని పరిశీలిస్తే.. ‘పాండవులు వనవాసానికి వెళ్తున్నప్పుడు తనని పూజించేందుకు కృష్ణుడు వాళ్లకు ఒక విగ్రహాన్ని ఇచ్చాడు. వనవాసం పూర్తయ్యే సరికి పాండవులు ‘చేరాల’ అనే ప్రాంతంలో ఉన్నారు. వాళ్లు అక్కడి నుండి తిరిగి వెళ్తున్నప్పుడు కృష్ణుడి విగ్రహాన్ని తమకు ఇవ్వమని ఊరివాళ్ళు అడగడంతో పాండవులు ఇచ్చేస్తారు. దీంతో ఓ ఆలయాన్ని నిర్మించి, అందులో స్వామిని ప్రతిష్ఠించారు. రోజులు గడిచే కొద్దీ, ఊరి వాళ్ళకు రకరకాల సమస్యలు ఎదురయ్యాయి. స్వామీజీ సలహాతో ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి కొలనులో వదిలేశారు’.
ఇలా ముద్రించి ఉన్న పాఠ్య పుస్తకంపై సిద్దిపేటలోని ప్రభుత్వ ప్రథమిక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు స్పందించారు. మహాభారత ఇతిహాసానికి సంబంధం లేని అంశాన్ని ఈ పుస్తకంలో ప్రస్తావించినట్లు ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యూకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అధికారులు స్పందిస్తూ అనుకోకుండా జరిగిన పొరపాటు అని ఉద్దేశ్యపూర్వకంగా చేసినది కాదని వివరణ ఇచ్చారు. అంతేకాకుండా ఈ పుస్తకం ఆన్లైన్ వెర్షన్‌ను తొలగించడం జరిగిందని, ఇకపై ఇలాంటి తప్పిదాలు జరుగకుండా చూసుకుంటామని తెలిపారు. ఇది కేవలం పొరపాటున జరిగిన విషయమే తప్ప ఏ మతాన్ని కించపరచాలన్న దురుద్దే్శ్యంతో చేసిన చర్య కాదని బదులిచ్చారు. దీంతో ఈ సమస్యకు తెరదించినట్లైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




