Telangana Election: పార్టీలు మారాయి.. కండువాలు మారాయి.. మూడోసారి ప్రత్యర్థులు వారే..!
2023 ఎన్నికల్లో మూడోసారి తాజా, మాజీల మధ్య పోరు జరుగుతోంది. కాకపోతే మళ్ళీ పార్టీలు, కండువాలు మారాయి..ప్రత్యర్థులు వాళ్ళే. బీఆర్ఎస్ అభ్యర్థిగా హరిప్రియచ, కాంగ్రెస్ అభ్యర్థిగా కోరం కనకయ్య పోటీ పడుతున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ ఇద్దరి మధ్య హోరాహోరిగా పోరు జరిగింది. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి కోరం కనకయ్యకు 66,925 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రియకు 69, 579 ఓట్లు లభించాయి.

ఇల్లందు నియోజకవర్గంలో తాజా, మాజీల మధ్య ఎన్నికల పోరు జరుగుతోంది. మూడు ఎన్నికల్లోనూ వీరే ప్రత్యర్థులు. రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. ప్రతిపక్షాన్ని గెలిపించడం అక్కడి ఓటర్లకు విలక్షణ అలవాటు. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలకు పెద్దపీట వేసిన ఇల్లందు ఓటర్లు.. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కి జైకొట్టారు. అలా గెలిచిన ఎమ్మెల్యేలు.. హస్తం పార్టీకి హ్యాండిచ్చి గులాబీ పార్టీలో చేరిపోయారు. ఆసక్తికర రాజకీయానికి కేరాఫ్‌గా నిలిచిన ఆ నియోజకవర్గమే ఇల్లందు.. గతంలో గెలిచిన అభ్యర్థులు పార్టీలు మారారు. కండువాలు, గుర్తులు మారాయి. ముచ్చటగా మూడోసారి తలపడుతున్న ఆ ఇద్దరిలో విజయం ఎవరిదన్నదీ ఆసక్తికరంగా మారింది.
ఇల్లందు లో ఎన్నికల పోరు హోరా హోరీగా మారింది. మూడోసారి వాళ్ళే ప్రత్యర్థులు, గత రెండు ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడ్డారు. చెరోకసారి విజయం సాధించారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా కోరం కనకయ్య పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి బానోత్ హరిప్రియపై విజయం సాధించారు. గెలిచిన తర్వాత కోరం కనకయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో హరిప్రియ కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో వాళ్ళే ప్రత్యర్థులు. పార్టీలు, కండువాలు మారాయి. కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రియచ బీఆర్ఎస్ అభ్యర్థి కోరం కనకయ్యపై విజయం సాధించారు. వరుసగా రెండు సార్లు ప్రధాన పార్టీలు నుంచి తలపడి చెరొక సారి విజయం సాధించారు. ఈసారి సేమ్ సీన్.. కాకపోతే పార్టీలు మారారు అంతే..!
ప్రస్తుత 2023 ఎన్నికల్లో మూడోసారి తాజా, మాజీల మధ్య పోరు జరుగుతోంది. కాకపోతే మళ్ళీ పార్టీలు, కండువాలు మారాయి..ప్రత్యర్థులు వాళ్ళే. బీఆర్ఎస్ అభ్యర్థిగా హరిప్రియచ, కాంగ్రెస్ అభ్యర్థిగా కోరం కనకయ్య పోటీ పడుతున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ ఇద్దరి మధ్య హోరాహోరిగా పోరు జరిగింది. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి కోరం కనకయ్యకు 66,925 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రియకు 69, 579 ఓట్లు లభించాయి. అయితే ఎమ్మెల్యేగా గెలుపొందిన హరిప్రియ కూడా అధికార బీఆర్ఎస్లో చేరారు..ఓటమి చెందినప్పటికీ కోరం కనకయ్యకు భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు గులాబీ బాస్.
ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్లు, ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు, వర్గ పోరుతో.. కొద్ది నెలల క్రితం జూలై నెలలో కోరం కనకయ్య కాంగ్రెస్‌లో చేరారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్న కనకయ్య, గెలుపు కోసం పొంగులేటి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ డి వెంకటేశ్వర రావు, ముగ్గురు కౌన్సిలర్స్ తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇంకా కొందరు ఇతర పార్టీల అసంతృప్త నేతల్ని కాంగ్రెస్‌లోకి తీసుకు వచ్చేందుకు తుమ్మల, పొంగులేటి మంతనాలు జరుపుతున్నారు.
హరి ప్రియ తరపున ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా పార్లమెంటు సభ్యులు గాయత్రి రవి రంగంలోకి దిగారు. ఆమె గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ అసంతృప్త నేతలకు గాలం వేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య, మడత వెంకట గౌడ్‌లు.. బీఆర్ఎస్‌లో చేరారు. రెండు పార్టీలు.. గెలుపు కోసం ఎత్తులు పైఎత్తులు వేస్తూ ప్రచారం ఉధృతం చేశారు. ఇదంతా చూస్తుంటే, ఎన్నికల నాటికి సమీకరణాలు ఏ విధంగా మారతాయి.. ఈసారి గెలుపు ఎవరిదో అన్నదీ ఆసక్తిగా మారింది..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…