AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సంతూర్ సబ్బుల లోడ్‌తో వెళ్తోన్న లారీకి యాక్సిడెంట్ – డ్రైవర్ మృతి – అయినా పట్టించుకోకుండా

లక్షెట్టిపేట సమీపంలో జరిగిన లారీ ప్రమాదంలో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయినా.. అటుగా వెళ్తున్నవారు, స్థానికులు మానవత్వాన్ని మరిచి సంతోషంగా సంతూర్ సబ్బులను ఎత్తుకెళ్లడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. ప్రమాదంతో రహదారి మొత్తం ట్రాఫిక్‌గా మారగా.. పోలీసులు జనాన్ని చెదరగొట్టి అంతా క్లియర్ చేశారు .

Telangana: సంతూర్ సబ్బుల లోడ్‌తో వెళ్తోన్న లారీకి యాక్సిడెంట్ - డ్రైవర్ మృతి - అయినా పట్టించుకోకుండా
Looting Soaps
Naresh Gollana
| Edited By: |

Updated on: Jun 26, 2025 | 8:52 AM

Share

ఇళ్లు‌ కాలి ఒకడు ఏడుస్తుంటే ఇంట్లో దోచుకోవడానికి ఏమి లేకపాయే అని ఏడ్చాడంట మరొకడు. ఇలాంటి ఘటనే మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటి పరిధిలో చోటు చేసుకుంది. మనిషి స్వార్ధం ఎంతటి ప్రమాదంలో అయినా లాభం చూసుకుంటుంది అన్న తీరే కనిపించింది. లక్షెట్టిపేట మండలం ఇటిక్యాల సమీపంలోని జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సంతూర్ సబ్బుల లోడ్‌తో వెళ్తున్న లారీని కేటీసీ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు లారీల క్యాబిన్లు నుజ్జు నుజ్జయ్యాయి. ఇద్దరి డ్రైవర్లకు తీవ్ర గాయాలు కాగా.. సంతూర్ సబ్బుల లారీ క్యాబిన్‌లో ఇరుక్కుని డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. జనాలు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా ప్రమాదానికి గురైన సంతూర్ సబ్బుల లోడ్‌ను పోటీ పడి మరీ ఖాళీ చేశారు. ఓ వైపు మనుషుల ప్రాణాలు పోయాయని తెలిసినా అవేమి పట్టించుకోకుండా సబ్బులను పోటీ పడి మరీ ఎత్తుకెళ్లారు. ఇరుకు రోడ్డు కావడంతో భారీగా ట్రాపిక్ జాం అయింది. రంగంలోకి దిగిన పోలీసులు.. మిగిలిన సంతూర్ సబ్బులను కాపాడే ప్రయత్నం చేశారు.

ప్రమాదం జరిగిందనే మానవత్వాన్ని మరిచి దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా సబ్బులను ఎత్తుకెళ్లిన స్థానికుల తీరుపై పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. కొందరైతే సంతోషంతో ఉప్పొంగి మరీ సబ్బులను ఎత్తుకెళ్లడం కనిపించింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో లారీ డ్రైవర్, క్లీనర్లను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు