AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పైకి చూసి సాదాసీదా మందుల షాప్ అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాంక్

డ్రగ్స్‌కు అలవాటుపడిన యువత ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. టాబ్లెట్స్ రూపంలో డ్రగ్స్ విక్రయిస్తూ నలుగురు యువకులు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వారి నుంచి రూ.25 వేల విలువైన 2,400 స్పాస్మో టాబ్లెట్స్, బైక్, రూ.22 వేల నగదు, రెండు సెల్‌ఫోన్లు, షాప్ లైసెన్స్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు.

Telangana: పైకి చూసి సాదాసీదా మందుల షాప్ అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాంక్
Representative Image
M Revan Reddy
| Edited By: |

Updated on: Apr 25, 2025 | 11:34 AM

Share

నల్లగొండ పట్టణానికి చెందిన మహ్మద్ ఖాజా వసీముద్దీన్, ఖాజా షోయబ్, షేక్ అమేర్‌లు జల్సాలకు అలవాటుపడ్డారు. కొంతకాలంగా స్పాస్మో టాబ్లెట్స్ తీసుకుంటున్నారు. వాటికి బానిసై.. ఇదే క్రమంలో డ్రగ్స్‌కు అడిక్ట్ అయి ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. కొంతకాలంగా స్పాస్మో టాబ్లెట్స్ సేవిస్తూ వాటికి బానిసై, ఈజీగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా నల్లగొండ చుట్టుపక్కల ప్రాంతాల్లోని మెడికల్ షాపుల్లో ఈ మాత్రను సేకరించేవారు. పోలీసుల నిఘా పెరగడంతో నల్లగొండ పరిసర ప్రాంతాల్లోని మెడికల్ షాపుల్లో స్పాస్మో టాబ్లెట్స్ దొరకడం కష్టంగా మారింది. దీంతో ఆరు నెలల క్రితం ఖాజా షోయబ్, అమేర్‌లకు పిడుగురాళ్లలోని ఓ మెడికల్ షాప్ నిర్వాహకుడు మణిదీప్ పరిచయమయ్యాడు. ఆరు నెలలుగా అతడి నుంచి ఒక్క షీట్ రూ.100కు కొనుగోలు చేసి వాటిని అవసరం ఉన్నవారికి రూ.180కు విక్రయస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో మహ్మద్ వసీముద్దీన్ 288 టాబ్లెట్స్ షీట్స్ తీసుకుని, అవసరం ఉన్నవారికి విక్రయిస్తున్నాడు.

నల్లగొండలోని మునుగోడు రోడ్డులో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా మమ్మద్ ఖాజా అనుమానాస్పదంగా బైక్‌పై బ్యాగుతో ఉండగా, అదుపులోకి తీసుకుని విచారించారు. డ్రగ్స్ దందా గుట్టు రట్టయింది. మమ్మద్ ఖాజా వసీముద్దీన్‌తోపాటు గురజాల మెడికల్ షాప్ నిర్వాకుడు మణిదీప్‌ను అరెస్టు చేశారు. ఈ ముఠాలోని మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. వీరి వద్ద నుంచి 25,000 విలువ గల 2400 స్పాస్మో టాబ్లెట్స్, బైక్, 22,000 నగదు, రెండు సెల్ ఫోన్లు, షాప్ లైసెన్స్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డ్రగ్స్ అమ్మితే షాప్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తప్పవని మెడికల్ షాప్ నిర్వాహకులను హెచ్చరించారు.