Telangana: ఆస్పత్రి బిల్లు కోసం రూ. 18 వేలు బ్యాంక్‌లో వేశాడు.. తీరా అకౌంట్ చెక్ చేయగా
ఆస్పత్రి బిల్లు కోసం డబ్బులు బ్యాంక్‌లో వేశాడు. క్యాష్ డిపాజిటరీ మిషన్‌లో డబ్బులు డిపాజిట్ చేశాడు. రిసీప్ట్ కూడా వచ్చింది.. కట్ చేస్తే.. అకౌంట్‌లోకి డబ్బులు రాలేదు. అదేంటా అని మేనేజర్‌ను అడిగితే.. చూస్తా వెళ్లు అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

శుక్రవారం ఉదయం 10.48కి తవ్వారుపల్లెకు చేందిన తవ్వా పాలకొండయ్య ఆసుపత్రికి అత్యవసరమై ఖాజీపేట SBI బ్యాంక్ పక్కనే ఉన్న CDM (క్యాస్ డిపాజిట్ మిషన్)లో రూ. 18,000 డిపాజిట్ చేశాడు. రిసిప్ట్ వచ్చింది కానీ డబ్బులు ఇతని అకౌంట్ లో క్రెడిట్ కాలేదు. ఈ విషయమై ఖాజీపేట స్టేట్ బ్యాంక్‌లో క్యాషియర్ కె.శివశంకర్ రెడ్డిని అడిగితే CDM పనిచేయడంలేదని లెటర్ రాసిచ్చిపో.. వారం తర్వాత మీ డబ్బు వస్తుంది అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడు. ఆసుపత్రికి అత్యవసరం అని అడిగితే ఇలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం ఏమిటని అడిగితే మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి CDMలో బెల్ట్ సరిగా పనిచేయడం లేదని చెబుతున్నాడు.
మిషన్ సరిగా పని చేయనప్పుడు దాని ముందు బోర్డు పెట్టాలి కదా అని బాధితుడు పాలకొండయ్య అడిగితే పెట్టము నీ చేతనైంది చేసుకోమని బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం పట్ల బాధితులు విస్తు పోతున్నారు. తర్వాత బ్యాంకు మేనేజర్ ను సంప్రదించగా వీలైనంత త్వరగా సమస్య పరిష్కామన్నారు. కానీ CDM పని చేయనప్పుడు బోర్డు పెట్టకుండా ప్రజలను ఇలా ఇబ్బందులపాలు చేయడం సమంజసమేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తనకు ఆసుపత్రి అవసరం రిత్యా సమస్య వీలైనంత త్వరగా పరిష్కరించాలని బాధితుడు తవ్వా పాలకొండయ్య విన్నవించారు.
ఎస్బిఐ పనితీరులో మార్పు రావాలి..
కాజీపేటలో పనిచేస్తున్న ఎస్బిఐ సిబ్బంది పనితీరులో మార్పు రావాలని స్థానికులు కోరుతున్నారు. ఖాతాదారులకు నిర్లక్ష్యపు సమాధానాలు.. కనీసం గౌరవం కూడా లేకుండా మాట్లాడడం సరైనది కాదని అంటున్నారు. ఎవరైనా సమస్యలపై వస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం వారికి అలవాటుగా మారిందని ఖాతాదారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి.. సిబ్బంది పనితీరులో మార్పు తీసుకురావాలని.. లేకపోతే వారి స్థానంలో బాగా పనిచేసేవారు నియమిస్తే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




