AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మృత్యువుకు మార్గాలుగా ఈ రహదారులు.. మూడు రోజుల వ్యవధిలో 6 గురు మృతి..

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాజేంద్ర నగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికిగల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తున్నారు. అందులో నలుగురు యువకులు కాగా మరొక యువతి ఉంది. నలుగురు యువకులు కాకినాడకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు.

మృత్యువుకు మార్గాలుగా ఈ రహదారులు.. మూడు రోజుల వ్యవధిలో 6 గురు మృతి..
Road Accident
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Apr 14, 2024 | 10:31 AM

Share

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాజేంద్ర నగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికిగల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తున్నారు. అందులో నలుగురు యువకులు కాగా మరొక యువతి ఉంది. నలుగురు యువకులు కాకినాడకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. యువతి సూర్యాపేట జిల్లా వాసిగా గుర్తించారు. శనివారం వీకెండ్ కావడంతో ఒకే కారులో శంషాబాద్ వైపు వెళ్లిన వీరంతా తిరిగి తెల్లవారుఝామున గచ్చిబౌలి వస్తున్న సమయంలో డివైడర్ని ఢీకొట్టారు.

ఈ ప్రమాదంలో గౌతమ్, ఆనంద్ ఇద్దరు చనిపోగా.. ముగ్గురు శంషాబాద్‎లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్‎గా గుర్తించారు. పోలీసులు ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణంగా చెప్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇబ్రహీంపట్నం రహదారిపై రెండు కార్లు అతివేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. ఇలా నగర శివారులో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అతివేగం కారణంగానే ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలోనే వివిధ ప్రాంతాల్లో ఆరు మంది మృతి చెందారు. నగర శివారులో డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అతివేగంతో ప్రాణాలను కోల్పోవద్దంటూ పోలీసులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్