AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abhishek Sharma: టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ.. రోహిత్ శర్మ రికార్డు బద్దలు

Abhishek Sharma Duck Record: జపాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ గోల్డెన్ డక్ అయ్యి చెత్త రికార్డు సృష్టించారు. ఒకే కేలండర్ ఇయర్‌లో 10 సార్లు డక్ అయిన తొలి ప్లేయర్‌గా నిలిచారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 

Abhishek Sharma: టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ.. రోహిత్ శర్మ రికార్డు బద్దలు
Abhishek Sharma (1)
Rakesh
|

Updated on: Sep 22, 2026 | 3:05 PM

Share

Abhishek Sharma: భారత జట్టు యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఊహించని విధంగా చెత్త రికార్డును తన పేరున లిఖించుకున్నారు. జపాన్‌లోని సానో గ్రౌండ్‌లో జరిగిన చారిత్రక టీ20 మ్యాచ్‌లో బరిలోకి దిగిన అభిషేక్ శర్మ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. మ్యాచ్ మొదటి ఓవర్ చివరి బంతికి చార్లీ హారా-హింజె బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా, బాల్ టాప్ ఎడ్జ్ అయి షార్ట్ ఫైన్ లెగ్‌లో ఉన్న షోమా సుగాయా-స్లేటర్ చేతికి చిక్కింది. దీంతో అతను గోల్డెన్ డక్ రూపంలో వెనుదిరిగి క్రీడా చరిత్రలో ఎవరూ కోరుకోని ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నారు.

ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు డక్

ఈ ఏడాది 2026లో అభిషేక్ శర్మ డక్ కావడం ఇది ఏకంగా 10వ సారి కావడం గమనార్హం. టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 10 సార్లు జీరో చుట్టిన తొలి ఆటగాడిగా అభిషేక్ నిలిచారు. దీనికి ముందు ఈ రికార్డు ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (2019లో 9 సార్లు), పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ (2024లో 9 సార్లు) పేరిట ఉండేది. వారిద్దరి పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ అత్యధిక డక్‌ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నారు. అంతేకాకుండా టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధికంగా 5 సార్లు గోల్డెన్ డక్ అయిన భారతీయ ఓపెనర్‌గా కూడా ఆయన రికార్డు సృష్టించారు. గతంలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 4 సార్లు గోల్డెన్ డక్ అయ్యి ఉండగా, ఆ రికార్డును ఇప్పుడు అభిషేక్ దాటేసారు.

భారత్ – జపాన్ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 32 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 16 పరుగులు, సంజు శాంసన్ 9 పరుగులు చేయగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్ జట్టు కూడా గట్టి పోటీ ఇచ్చింది. కెప్టెన్ కెండెల్ కడోవాకి-ఫ్లమింగ్ 12 పరుగులు చేసి పోరాడారు. ఆఖరి ఓవర్లో జపాన్ విజయానికి 8 పరుగులు అవసరం కాగా, భారత స్టార్ బౌలర్ అక్షర్ పటేల్ కట్టదిట్టంగా బౌలింగ్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి భారత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించారు.

తొలిసారి ఎదురుపడ్డ భారత్ – జపాన్

భారత్, జపాన్ జట్ల మధ్య అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇదే మొట్టమొదటి మ్యాచ్ కావడం విశేషం. ఏషియన్ గేమ్స్ లేదా ఇలాంటి టోర్నీల్లో జపాన్ వంటి అభివృద్ధి చెందుతున్న క్రికెట్ దేశాలు బలమైన జట్లకు గట్టి పోటీ ఇస్తుండటం క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు తడబడినప్పటికీ, బౌలర్లు చివరి క్షణంలో నిలకడ ప్రదర్శించి కేవలం రెండు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేశారు. అభిషేక్ శర్మ ఫామ్ ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, రాబోయే మ్యాచ్‌లలో ఆయన తన తప్పులను సరిదిద్దుకుని మళ్లీ ఫామ్‌లోకి వస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us