కొప్పులో రోజా పువ్వు.. బుగ్గన చుక్క..! ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ఒక్క హాట్ ఒకే ఒక్క హిట్ పడితే చాలు హీరోయిన్స్ దశ తిరిగిపోతుంది. ఇప్పుడున్న ముద్దుగుమ్మలు ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు. ఒకే ఒక్క సినిమాతో హిట్ అందుకొని క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్నారు. ఒక్క సినిమా క్లిక్ అయితే చాలు వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం చాలా వరకు తగ్గిపోయింది. ఒకప్పుడు తమ అభిమాన హీరో, హీరోయిన్‌ను తెరపై మాత్రమే చూసే ఫ్యాన్స్.. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నారు. తమ సినిమాల అప్‌డేట్స్‌తో పాటు ఫ్యామిలీ మూమెంట్స్, ట్రావెల్ ఫొటోలు, బర్త్‌డే సెలబ్రేషన్స్, చిన్ననాటి జ్ఞాపకాలను కూడా స్టార్స్ అభిమానులతో పంచుకుంటున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీల త్రోబ్యాక్ ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాయి. చిన్నతనంలో వారు ఎలా ఉండేవారో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో హీరో, హీరోయిన్లు షేర్ చేసే చైల్డ్‌హుడ్ పిక్స్ క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇలాంటి ఓ పాత ఫొటోనే సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. పైన కనిపిస్తున్న ఫొటోలో ఎంతో క్యూట్‌గా, అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి.
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ఫొటోను చూసిన వెంటనే చాలామందికి ఆమె ఎవరో గుర్తుపట్టడం కాస్త కష్టమే. కానీ ఒకసారి పేరు తెలిస్తే.. ‘అరే, ఈమెనా!’ అని అనిపిస్తుంది. ఆమె నందిత శ్వేత. ఈ ముద్దుగుమ్మ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మ్యూజిక్ ఛానల్‌లో వీజేగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 2008లో వచ్చిన ‘నంద లవ్స్ నందిత’ సినిమాతో నటిగా పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె పోషించిన పాత్ర పేరు ‘నందిత’. ఆ పాత్రకు వచ్చిన గుర్తింపుతో అదే పేరును తన స్క్రీన్ నేమ్‌గా కొనసాగించింది. కన్నడ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలోనూ నందిత శ్వేత తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కించిన ‘అట్టకతి’ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో నందిత శ్వేత టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించింది.
బిందాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతిపోవాల్సిందే.. ఇప్పుడు ఎలా ఉందంటే
‘శ్రీనివాస కళ్యాణం’, ‘బ్లఫ్ మాస్టర్’, ‘ప్రేమకథా చిత్రమ్ 2’, ‘కల్కి’, ‘అక్షర’, ‘కపటధారి’ వంటి సినిమాల్లో విభిన్న పాత్రల్లో కనిపించింది. అయితే హీరోయిన్‌గా మంచి ప్రతిభ ఉన్నప్పటికీ ఆమెకు తెలుగులో ఆశించిన స్థాయిలో వరుస అవకాశాలు మాత్రం దక్కలేదు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ నందిత శ్వేత యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫొటోలు, సినిమా అప్‌డేట్స్‌తో పాటు అభిమానులతో అప్పుడప్పుడు తన జ్ఞాపకాలను పంచుకుంటుంది. ప్రస్తుతం నందిత శ్వేతకు సంబంధించిన ఈ చైల్డ్‌హుడ్ ఫొటో మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
బిగ్ బాస్ అంటే ఇష్టం.. కానీ ఛాన్స్ వస్తే మాత్రం వెళ్ళాను.. సీరియల్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




