AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేం క్రేజ్ రా సామీ.. 24 గంటల్లోనే అమ్ముడైన టిక్కెట్లు.. ఆ ఇద్దరితో అట్లుంటది మరి..!

India vs West Indies ODI: భారత్-వెస్టిండీస్ మధ్య జరగనున్న తొలి వన్డే మ్యాచ్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే జట్టులోకి తిరిగి రావడంతో అభిమానుల ఆసక్తి తారాస్థాయికి చేరింది. తిరువనంతపురంలో సెప్టెంబర్ 27న జరిగే ఈ మ్యాచ్ టికెట్లన్నీ కేవలం 24 గంటల్లోనే అమ్ముడుపోవడం విశేషం.

ఇదేం క్రేజ్ రా సామీ.. 24 గంటల్లోనే అమ్ముడైన టిక్కెట్లు.. ఆ ఇద్దరితో అట్లుంటది మరి..!
Rohit Sharma Virat Kohli Return
Venkata Chari
|

Updated on: Sep 23, 2026 | 1:32 PM

Share

Rohit Sharma Virat Kohli Return: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న తొలి వన్డే మ్యాచ్‌కు నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వస్తోంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. స్వదేశంలో మ్యాచ్ జరుగుతుండటం, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ బ్యాటర్లు బరిలోకి దిగడమే దీనికి ముఖ్య కారణం. ఈ నెల 27న కేరళలోని తిరువనంతపురంలో జరగనున్న ఈ మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లన్నీ కేవలం 24 గంటల్లోనే అమ్ముడుపోవడం విశేషం. వన్డే ఫార్మాట్‌కు ఆదరణ తగ్గుతోందని విమర్శలు వస్తున్న సమయంలో, ఒక్క టికెట్ కూడా లేకుండా మొత్తం టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోవడం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రీఎంట్రీ..

భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే జట్టులో తిరిగి చేరడంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల ఆసక్తి మరింత పెరిగింది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. సుదీర్ఘ విరామం తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను వన్డే జట్టులో చూడబోతుండటంతో ఈ తొలి మ్యాచ్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. మొన్న 17వ తేదీన ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలను కేరళ క్రికెట్ అసోసియేషన్ తమ అధికారిక ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రారంభించింది. బుకింగ్ ప్రారంభమైన కొద్ది సమయంలోనే అభిమానులు పెద్ద సంఖ్యలో టికెట్లు కొనుగోలు చేయడంతో 24 గంటలు పూర్తయ్యేలోపే ఉన్న టికెట్లన్నీ అమ్ముడుపోయినట్లు సమాచారం. దీంతో ఈ నెల 27న జరగనున్న తొలి వన్డేకు స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్ల రీ ఎంట్రీ ఈ మ్యాచ్‌కు అదనపు ఆకర్షణగా మారింది.

27 నుంచి వన్డేలు..

ఇక మొత్తంగా వెస్ట్ ఇండీస్‌తో ఈ నెల 27 నుంచి వన్డేలు, ఆ తర్వాత టీ20 లలో టీమిండియా తలపడనుంది. ప్రస్తుతం టీ20 జట్టు జపాన్ పర్యటనలో ఉంది. అక్కడ జపాన్‌తో ఏకైక టీ20 అలాగే ఏషియన్ గేమ్స్‌లో టీమిండియా బరిలోకి దిగుతుంది. అది జరుగుతుండంగానే ఇక్కడ వెస్ట్ ఇండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా తలపడబోతోంది. ఆ తర్వాత ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా తలపడబోతోంది. ఇక ఈ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, వెస్ట్ ఇండీస్ జట్లు ఈ నెల 23 నాటికి తిరువనంతపురం చేరుకోనున్నాయి. అనంతరం ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొని మ్యాచ్‌కి సిద్ధమవుతారు. ఈ మ్యాచ్ ద్వారా రోహిత్, కోహ్లీ తమ ఫామ్‌ను కొనసాగించి అభిమానులను అలరిస్తారని ఆశలు పెట్టుకున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
600 ఏళ్లు.. అమ్మవారికి తొలి నైవేద్యం సమర్పించేది ముస్లిం కుటుంబమే
600 ఏళ్లు.. అమ్మవారికి తొలి నైవేద్యం సమర్పించేది ముస్లిం కుటుంబమే
రెండు నెలల్లో ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం..!
రెండు నెలల్లో ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం..!
ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. పోలింగ్, ఫలితాల తేదీ ఇదిగో
ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. పోలింగ్, ఫలితాల తేదీ ఇదిగో
ఆ సినిమాలో కథ ఉందా అని అడిగా..
ఆ సినిమాలో కథ ఉందా అని అడిగా..
ఇలా చేస్తే చూస్తూ ఉండిపోకండి.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు
ఇలా చేస్తే చూస్తూ ఉండిపోకండి.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు
సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లలో బెర్తులు!
సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లలో బెర్తులు!
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు.. జస్ట్ 32 నెలల్లో
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు.. జస్ట్ 32 నెలల్లో
గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!
గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!
ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...
ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...