బెదిరిద్దామనుకున్నాడు.. బ్యాడ్ లక్..! బార్య, కన్నతల్లి ముందే ప్రాణం విడిచిన యువకుడు!
వరంగల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా బెదిరింపు ప్రయత్నంలో ఉరి బిగుసుకుని ఓ యువకుడు తన భార్య, తల్లి ముందే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పర్వతగిరి మండలం నర్రెంగతండాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే మరణానికి కారణమా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది.

వరంగల్ జిల్లాలో విషాద సంఘటన జరిగింది.. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఉరి వేసుకొని భార్య – కన్నతల్లి ముందే ప్రాణాలు కోల్పోయాడు.. భార్యతో గొడవ నేపథ్యంలో వారిని బెదిరించేందుకు వేసుకున్న ఉరి బిగుసుకుని కళ్ళ ముందే గిలగిలా కొట్టుకుని ప్రాణాలు కోల్పోయారు.. ఆ దృశ్యాలను అక్కడే ఉన్న తన బంధువు సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించడం ద్వారా అసలు నిజం బయటపడింది..
కుటుంబ కలహాలు ఓ వ్యక్తి నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. తల్లి, మొదటి భార్య కళ్లముందే ఆ వ్యక్తి లైవ్ లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ విషాద ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పర్వతగిరి మండలం నర్రెంగతండాకు చెందిన బానోత్ జవహర్ లాల్ కుటుంబంలో కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. సోమవారం (సెప్టెంబర్ 21) మొదటి భార్యతో జవహర్ లాల్‌కు గొడవ జరిగింది. కుటుంబ సభ్యుల మధ్య గొడవ ముదరడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. భార్యభర్తల మధ్య గొడవను అడ్డుకునే ప్రయత్నం చేసిన కన్నతల్లిపై జవహర్ లాల్ దాడికి పాల్పడ్డాడు. మొదట ఒకసారి తాడుతో ఉరి వేసుకునే ప్రయత్నం చేశాడు. కానీ అతన్ని కిందకు దించిన తల్లి ఆ తాడు తొలగించింది.
ఇంట్లో జరుగుతున్న ఈ గొడవను దూరం నుండి జవహర్ లాల్ కోడలు తన సెల్‌ఫోన్‌లో వీడియో రికార్డు చేస్తుంది. ఇంట్లో భార్యతో జరిగిన ఘర్షణలో తీవ్ర మనస్తాపానికి, అవేశానికి గురైన జవహర్ లాల్ కుటుంబ సభ్యుల కళ్ల ముందే మరోసారి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చున్నీతో మరోసారి ఉరి వేసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో భార్య, కన్నతల్లి అతను బెదిరిస్తున్నాడని భావించారు. కానీ ఆ చున్ని మెడకు బిగుసుకుని గిలగిల కొట్టుకుని ప్రాణాలు కోల్పోయాడు. అయితే వీడియో తీస్తున్న యువతి.. అతని ప్రాణాలు ఎందుకు కాపాడలేకపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమా..? లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
